బంపర్ ఆఫర్.. 50 శాతం డిస్కౌంట్‌తో టాప్ బ్రాండ్ ఏసీ.. మీ ఇల్లంతా కూల్..
తక్కువ ధరకు బాగా పనిచేసే ఏసీ ఇది.

ఎండల వేడిని తట్టుకోవడానికి కొత్త ఏసీ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం వోల్టాస్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ 50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలో ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఎనర్జీ సేవింగ్, రోబస్ట్ కూలింగ్ కెపాబిలిటీస్ ఉన్నాయి.
గది ఉష్ణోగ్రత, కూలింగ్ అవసరానికి అనుగుణంగా మారే ఇన్వర్టర్ కంప్రెషర్‌తో ఈ ఏసీ వచ్చింది. 4-ఇన్-1 అడ్జస్టేబుల్ మోడ్‌లో దీన్ని తయారు చేశారు. విద్యుత్తును ఆదా చేస్తూ ఆటోమెటిక్‌గా ఉష్ణోగ్రతను అనుగుణంగా చల్లదనాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇంటి బయట 52 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఈ ఏసీ ఇంట్లో సమర్థంగా పూర్తి స్థాయిలో కూలింగ్‌ను అందిస్తుంది.
ఈ ఏసీ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వచ్చింది. ఆఫీసులో కాకుండా ఇంట్లో వాడడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది ఒక సంవత్సరంలో దాదాపు 975.26 యూనిట్ల విద్యుత్తును ఉపయోగిస్తుంది. ISEER రేటింగ్ 3.81 ఉంది. ఇది రాగి కండెన్సర్‌తో వచ్చింది. ఇంటిని వేగంగా చల్లబరుస్తుంది. సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులోని రాగి భాగాలు తుప్పు నిరోధకతతో ఉంటాయి.
ధర ఎంత?
ఈ ఏసీ మార్కెట్లోకి విడుదలైనప్పుడు దీని ధర రూ. 67,990. ఇప్పుడు రూ.33,990కు లభ్యమవుతోంది. అంటే ధర సగం తగ్గింది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు కనిష్ఠంగా రూ.1,648 చెల్లిస్తూ కూడా దీన్ని కొనుక్కోవచ్చు. రూ.1000 డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తున్నారు. తక్కువ ధరకు బాగా పనిచేసే ఏసీ ఇది.
కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,500 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. మీరు ఏఎంఐ చెల్లింపును ఎంచుకుంటే వడ్డీపై రూ.1,530.53 వరకు ఆదా చేయవచ్చు, ముఖ్యంగా హెచ్‌డీఎఫ్సీ డెబిట్ కార్డుతో ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.