IPL 2025: SRH vs LSG మ్యాచ్.. కోపంతో హెల్మెంట్ విసిరికొట్టిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్

SRH vs LSG మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ..

Nitish Kumar Reddy (Courtesy BCCI )

IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో లక్నో జట్టు ఐదు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Read Also : Pat Cummins: ఉప్పల్‌ మ్యాచ్.. “భారీ స్కోర్‌” అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్‌ ఆసక్తికర కామెంట్స్‌

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (47), నితీశ్ కుమార్ రెడ్డి (32) మినహా మిగిలిన బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి విజయం సాధించింది. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ (52), నికోలస్ పూరన్ (70) పరుగులు చేశారు.

Read Also: IPL Fans : జియో IPL ఆఫర్ అదుర్స్.. కేవలం రూ.100కే హైస్పీడ్ డేటా, 90 రోజులు మ్యాచ్‌‌లు ఫ్రీగా చూడొచ్చు!

మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి కోపంతో హెల్మెంట్ విసిరికొట్టారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ డకౌట్ రూపంలో వరుస బంతుల్లో వెనుదిరిగారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

 

అయితే, 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లక్నో స్పిన్నర్ బిష్ణోయ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో నిరాశగా నితీశ్ పెవిలియన్ బాటపట్టాడు. పెవిలియన్ మెట్లపై  ఆగ్రహంతో హెల్మెంట్ ను విసిరికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.