Pat Cummins: ఉప్పల్ మ్యాచ్.. “భారీ స్కోర్” అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర కామెంట్స్
తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని అన్నాడు.

PIC: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ మొదట బౌలింగ్ తీసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాము ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఆడడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. ఇది గ్రేట్ ఫన్ అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ఎదురయ్యే సవాళ్లు, ఎక్సైట్‌మెంట్ గురించి ప్లేయర్లకు ముందుగానే అవగాహన ఉంటుందని అన్నాడు.
అధిక స్కోరింగ్ మ్యాచ్‌లలో బౌలర్ ఓవర్‌కు 10 లేదా 11 పరుగుల చొప్పున ఇచ్చుకున్నప్పటికీ ఒక్కోసారి అది మంచి పెర్ఫార్మన్సే అవుతుందని, జట్టు విజయానికి దోహదం చేస్తుందని తెలిపాడు. తమ టీమ్, ముఖ్యంగా జట్టులోని బౌలర్లు అందరూ కలిసి సమన్వయంతో ఆడి గెలవాలనుకుంటున్నారని చెప్పాడు. తమ జట్టు భారీ స్కోరు చేస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
టాస్ గెలవడంపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. తాము మొదట బౌలింగ్ చేస్తామని అన్నాడు. వీలైనంత వరకు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తామని, లక్ష్యాన్ని ఛేదిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇది టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అందుకే తాము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నామని అన్నాడు.
లక్ష్యాన్ని ఛేదించడానికి తమ వద్ద మంచి బ్యాటర్లు ఉన్నారని రిషబ్ పంత్ తెలిపాడు. జట్టులో ఒకే ఒక్క మార్పుతో ముందుకు వస్తున్నామని, అవేశ్‌ను తీసుకుంటున్నామని, షాబాజ్ ఆడడం లేదని చెప్పాడు. ఎస్ఆర్‌హెచ్ ఎంత స్కోరు చేసినా తాము ఛేజ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: షాబాజ్, మణిమారన్ సిద్ధార్థ్, మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్