SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌ తీరుపై కడుపుబ్బా నవ్విస్తోన్న మీమ్స్‌.. ఇలా చేస్తున్నారేంటి?

ఈ రేంజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు చేస్తుంటే అందరి గుండెలు అదిరిపోతున్నాయని నెటిజన్లు మీమ్స్‌ సృష్టిస్తున్నారు.

SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌ తీరుపై కడుపుబ్బా నవ్విస్తోన్న మీమ్స్‌.. ఇలా చేస్తున్నారేంటి?

Updated On : March 27, 2025 / 6:49 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ – 2025లో 7వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తాయి.

ఎస్‌ఆర్‌హెచ్‌ తన బ్యాటింగ్‌తో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. గత ఆదివారం ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ను 44 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచులో ఆడిన తీరు వల్ల ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్‌ అగ్ర స్థానంలో ఉంది. ఆ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హయ్యెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేసుకుంది.

అంతేగాక, ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక స్కోరు నమోదైన మొదటి మూడు స్థానాల్లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టే ఉంది. ఆదివారం జరిగిన మ్యాచులో హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 300 అని నెటిజన్లు అంటున్నారు. ఈ రేంజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు చేస్తుంటే అందరి గుండెలు అదిరిపోతున్నాయని నెటిజన్లు మీమ్స్‌ సృష్టిస్తున్నారు.