×
Ad

IPL 2026 auction : జమ్ము క‌శ్మీర్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.. కోట్ల వ‌ర్షం..

అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction ) జమ్ము క‌శ్మీర్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.

IPL 2026 auction Auqib Dar Sold to DC

IPL 2026 auction : అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్ము క‌శ్మీర్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని 8.40 కోట్ల మొత్తానికి కొనుగోలు చేసింది.

30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలో అడుగుపెట్టిన అక్విబ్ నబీ దార్ కోసం ఫ్రాంఛైజీలు పోటీప‌డ్డాయి. తొలుత ఢిల్లీ క్యాపిట‌ల్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీప‌డ్డాయి. అత‌డి ధ‌ర 2 కోట్ల మొత్తానికి చేరుకోగా రేసు నుంచి రాజ‌స్థాన్ త‌ప్పుకుంది. ఆ త‌రువాత ఆర్‌సీబీ ఎంట్రీ ఇచ్చింది. మ‌రికాసేటికే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా రేసులోకి వ‌చ్చింది. దీంతో అత‌డి ధ‌ర అమాంతం పెరుగుకుంటూ పోయింది.

IPL 2026 auction : న‌క్క‌తోక తొక్కిన ర‌వి బిష్ణోయ్‌.. స‌న్‌రైజర్స్‌తో పోటీప‌డి భారీ మొత్తానికి ద‌క్కించుకున్న రాజ‌స్థాన్‌

బెంగ‌ళూరు త‌ప్పుకున్న‌ప్ప‌టికి కూడా స‌న్‌రైజ‌ర్స్‌, ఢిల్లీ జ‌ట్లు పోటీప‌డ్డాయి. చివ‌రికి రూ.8.40 కోట్ల మొత్తానికి అత‌డిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డు..

అక్విబ్ నబీ దార్ కు దేశ‌వాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 36 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు తీయ‌గా 870 ప‌రుగులు చేశాడు. 29 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 42 వికెట్లు తీయ‌డంతో పాటు 351 ప‌రుగులు సాధించాడు. 34 టీ20 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీయ‌డంతో పాటు 141 ప‌రుగులు చేశాడు.

IPL 2026 auction : అబ్బా.. జాక్ పాట్ కొట్టిన శ్రీలంక యువ పేస‌ర్ మతీషా పతిరానా.. ఎన్ని కోట్లంటే..]