×
Ad

IPL 2026 auction : కార్తిక్ శర్మ.. రూ.14 కోట్లకు కొన్న CSK.. ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి?

అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction ) అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌పై కోట్ల వ‌ర్షం కురుస్తోంది.

IPL 2026 auction Kartik Sharma Sold to CSK

IPL 2026 auction : అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌పై కోట్ల వ‌ర్షం కురుస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 8.40 కోట్ల మొత్తానికి సొంతం చేసుకోగా.. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన ఆల్‌రౌండ‌ర్ ప్రశాంత్‌ వీర్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ 14.20 కోట్ల‌కు ద‌క్కించుకుంది. తాజాగా రాజ‌స్థాన్ బ్యాట‌ర్ కార్తిక్‌ శర్మను సైతం చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ. 14.20 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

క‌నీస ధ‌ర 30 ల‌క్ష‌ల‌తో వేలంలో అడుగుపెట్టిన కార్తిక్ శ‌ర్మ కోసం కేకేఆర్, చెన్నై, హైద‌రాబాద్ లు పోటీప‌డ్డాయి. తొలుత కేకేఆర్‌, చెన్నైలు హోరాహోరీ పోటీప‌డ్డాయి. ఈ క్ర‌మంలో చూస్తుండ‌గానే అత‌డి ధ‌ర 10 కోట్లు దాటిపోయింది.

IPL 2026 auction : వీడెవండీ బాబు.. 30ల‌క్ష‌ల‌తో అడుగుపెట్టి.. ఏకంగా 14 కోట్ల‌కు పైనే.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా..

కేకేఆర్ రేసు నుంచి త‌ప్పుకోగా  అనూహ్యంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖ‌రికి సీఎస్‌కే 14.20 కోట్ల‌కు అత‌డిని సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన అన్‌క్యాప్డ్ ఆట‌గాడిగా కార్తిక్ శ‌ర్మ‌.. ప్ర‌శాంత్ వీర్ తో క‌లిసి అగ్ర‌స్థానంలో నిలిచాడు.

IPL 2026 auction : జమ్ము క‌శ్మీర్ ఆల్‌రౌండ‌ర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.. కోట్ల వ‌ర్షం..

దేశ‌వాళీ క్రికెట్‌లో కార్తిక్ శ‌ర్మ‌కు హార్డ్ హిట్ట‌ర్‌గా పేరు ఉంది. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43.5 స‌గ‌టుతో 139 ప‌రుగులు సాధించాడు. 9 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 55.6 స‌గ‌టుతో 445 ప‌రుగులు చేశాడు. ఇక 12 టీ20 మ్యాచ్‌ల్లో 30.4 స‌గ‌టు 162.9 స్ట్రైక్‌రేటుతో 334 ప‌రుగులు సాధించాడు.