IPL 2026 Auction new rule for Foreign players they will get only 18 crores
IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. నేడు (డిసెంబర్ 16)న అబుదాబి వేదికగా వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది. మొత్తం 369 మంది క్రికెటర్లు వేలంలోకి రానుండగా.. 10 ఫ్రాంచైజీలు కలిపి 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఫ్రాంఛైజీల వద్ద మొత్తం నగదు 237.55 కోట్లు.
ఇక ఈ వేలంలో పెద్దగా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఉన్న వాళ్లలో ఎక్కువగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పైనే అందరిలో ఆసక్తి నెలకొంది. అత్యధిక నగదు ఉన్న కేకేఆర్, సీఎస్‌కే లు అతడి కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. ఈ వేలంలో అతడే అత్యధిక మొత్తం పొందిన ఆటగాడిగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.
విదేశీ ఆటగాళ్లకు 18 కోట్లే..
కొంత మంది విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనరు. తెలివిగా వారు మినీ వేలంలో పాల్గొని అత్యధికంగా నగదును పొందున్నారు. దీనిపై అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లకు రూ.18 కోట్ల కంటే ఎక్కువ మొత్తం లభించదు.
ఊదహరణకు ఓ విదేశీ ఆటగాడికి వేలంలో రూ.25 కోట్లుకు అమ్ముడు పోయాడు అని అనుకుందాం. అప్పుడు సదరు ఆటగాడికి రూ.18 కోట్లే వస్తాయి. ఇక ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ నుంచి రూ.25 కోట్ల మొత్తం కట్ అవుతుంది. ఆటగాడికి 18 కోట్లు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని ఫ్రాంఛైజీలు బీసీసీఐ ఖాతాలో జమ చేస్తాయి. ఇలా వచ్చిన మొత్తాన్నిబీసీసీఐ స్థానిక ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది.
Babar Azam : దటీజ్ బాబర్ ఆజామ్.. బిగ్‌బాష్ లీగ్ అరంగ్రేట మ్యాచ్‌లోనే..
ఈ నిబంధన కారణంగా ఒకవేళ గ్రీన్ వేలం 30 కోట్లకు అమ్ముడు పోయినప్పటికి కూడా అతడికి రూ.18 కోట్లే వస్తాయి.