IPl 2026 auction next day Cameron green duck out
Cameron Green : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మూడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 25.20 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇక తనను కోల్‌కతా కొనడం పై కామెరూన్ గ్రీన్ (Cameron Green) ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ తమ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గ్రీన్ మాట్లాడుతూ.. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా తరుపున ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ కప్పు గెలవాలని ఆకాంక్షించాడు.
Prithvi Shaw : పృథ్వీ షాను కొన్నారోచ్చ్.. ఒకప్పుడు 8 కోట్లు.. ఇప్పుడు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్..
First words from our 🆕 Knight 🎙️😍 pic.twitter.com/Qmg80QksXj
— KolkataKnightRiders (@KKRiders) December 16, 2025
భారీ ధర పలికిన మరుసటి రోజే..
ఐపీఎల్‌లో భారీ దక్కించుకున్న మరుసటి రోజే కామెరూన్ గ్రీన్ డకౌట్ కావడం గమనార్హం. యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన కామెరూన్ గ్రీన్ డకౌట్ అయ్యాడు. రెండు బంతులు మాత్రమే ఆడిన గ్రీన్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఇలాగే ఆడితే కేకేఆర్‌కు కప్పు ఖాయం అని సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ ఒక రోజు ముందు ఆడితే బాగుండేదిగా అని అంటున్నారు.