IPL 2026 Auction Venkatesh Iyer SOLD to rcb
IPL 2026 Auction : అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్ ను సొంతం చేసుకుంది.
2 కోట్ల కనీస ధరతో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ వేలంలోకి (IPL 2026 Auction) వచ్చాడు. అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. మొదటగా అతడి కోసం లక్నో, ఆర్‌సీబీ పోటీపడ్డాయి. మధ్యలో లక్నో తప్పుకోగా ఆ తరువాత కేకేఆర్ వచ్చి చేరింది.
Left-hand fire and fearless intent. 🔥
A big stage performer, Venkatesh Iyer, brings explosive top-order power and all-around punch.
He’s that kind of player who shifts momentum, FAST. 😮💨Welcome to RCB, Venkatesh Iyer. ❤️🔥#PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold pic.twitter.com/E68vqNpeHP
— Royal Challengers Bengaluru (@RCBTweets) December 16, 2025
ఆఖరి వరకు కేకేఆర్, ఆర్‌సీబీ లు పోటీపడ్డాయి. చివరకు కేకేఆర్ తప్పుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని రూ.7 కోట్లకు దక్కించుకుంది.
కాగా.. ఐపీఎల్ 2025 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వెంకటేష్ అయ్యర్‌ను (Venkatesh Iyer) రూ.23.75 కోట్లకు సొంతం చేసుకుంది. పేలవ ప్రదర్శన చేయడంతో వేలానికి విడిచిపెట్టింది. మినీ వేలంలో అతడి కోసం కేకేఆర్ గట్టిగానే ట్రై చేసింది. చివరికి వెంకటేష్ అయ్యర్ ఆర్‌సీబీ సొంతం అయ్యాడు.