SRH vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. శ్రేయస్ సేనకు దబిడి దిబిడే
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs PBKS ) నేడు తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Published on- May 6, 2026 / 10:03 AM IST
IPL 2026 Daniel Vettori gives Nitish Kumar Reddy injury update ahead of SRH vs PBKS match (pic credit@ipl)
- ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్
- ఈ మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్‌కు శుభవార్త
- గాయం నుంచి కోలుకున్న తెలుగోడు
SRH vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ కు శుభవార్త అందింది. గాయం కారణంగా గత మ్యాచ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో)కు దూరం అయిన నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరి తెలిపాడు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో వెటోరి మాట్లాడుతూ.. మంగళవారం నాటి శిక్షణలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడని, అతడు తిరిగి రావడంతో జట్టుకు సమతూకం వస్తున్నాడు.
Sanju Samson : చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు
ప్రతి జట్టులోనూ ఎంపికను చాలా సులభతరం చేసే ఆటగాడు ఉంటాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాకు ఒక బ్యాటర్ అవసరం కావడంతో స్మరణ్ రవిచంద్రన్‌ను ఎంచుకున్నాము, ఆ తర్వాత మరో సీమర్ కోసం సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. మార్కో జాన్సెన్ లేదా మార్కస్ స్టోయినిస్ లాగే నితీష్ కూడా జట్టుకు సమతుల్యతను అందించి నా పనిని చాలా సులభతరం చేస్తాడు. అని వెటోరి అన్నాడు.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ సేన 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లో ఓడిపోగా మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పంజాబ్ మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
Ruturaj Gaikwad : ఢిల్లీ పై విజయం.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ పై గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గర కావాలని ఆరాటపడుతోంది.
