Sanju Samson : చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు
ఐపీఎల్ 2026 సీజన్లో సంజూ శాంసన్ (Sanju Samson) భీకర ఫామ్‌తో ఆడుతున్నాడు.
Sanju Samson Creates History Becomes First Player Most Runs In A Season Against The Delhi Capitals (pic credit@ipl)
- అదరగొట్టిన సంజూ శాంసన్
- ఢిల్లీపై 87 పరుగులతో అజేయ ఇన్నింగ్స్
- పలు రికార్డులు బ్రేక్
Sanju Samson : ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 52 బంతులు ఆడాడు. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ పై ఈ అవార్డును అందుకోవడం ఇది రెండో సారి కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ పలు రికార్డులను అందుకున్నాడు.
సంజూ శాంసన్ ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి 202 పరుగులు చేశాడు. ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఈ క్రమంలో 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై ఓ సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Ruturaj Gaikwad : ఢిల్లీ పై విజయం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు..
ఐపీఎల్లో ఓ సీజన్లో ఒకే జట్టుపై 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా శాంసన్ రికార్డులకు ఎక్కాడు.
ఓ సీజన్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్లు వీరే..
* సంజూ శాంసన్ (సీఎస్కే) – ఢిల్లీపై 202 పరుగులు (2026లో)
* కేఎల్ రాహుల్ – ఆర్సీబీపై 193 పరుగులు (2019లో)
* నమన్ ఓజా – సీఎస్కే పై 174 పరుగులు (2010లో)
* కేఎల్ రాహుల్ – ముంబై పై 171 పరుగులు (2020లో)
* క్వింటన్ డికాక్ – ఆర్సీబీపై 168 పరుగులు (2016లో)
* బ్రెండన్ మెక్కల్లమ్ – ఆర్సీబీపై 158 పరుగులు (2008లో)
* ఆడమ్ గిల్‌క్రిస్ట్ – ఢిల్లీపై 157 పరుగులు (2009లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (38) లు రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు, అకేల్ హోసేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్రీత్ సింగ్, జామీ ఓవర్టన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IPL 2026 DC vs CSK : అదే మా కొంపముంచింది.. ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ హాట్ కామెంట్స్..
ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. సీఎస్కే బ్యాటర్లలో సంజూ శాంసన్ (87 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ (41 నాటౌట్ ) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి చెరో వికెట్ తీశారు.
