Ruturaj Gaikwad : ఢిల్లీ పై విజయం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
IPL 2026 DC vs CSK Ruturaj Gaikwad comments after Chennai Super Kings beat Delhi Capitals (pic credit@ipl)
- ఢిల్లీపై విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- సంజూ శాంసన్ పై ప్రశంసల జల్లు
Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సీఎస్కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ పై విజయం సాధించడం పట్ల సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (24 బంతుల్లో 40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 38 పరుగులు) రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అకేల్ హోసేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్రీత్ సింగ్, జామీ ఓవర్టన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 17.3 ఓవర్లలో 2 వికెట్లు అందుకుంది. చెన్నై బ్యాటర్లలో సంజూ శాంసన్ (87 నాటౌట్; 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్ ) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి చెరో వికెట్ తీశారు.
IPL 2026 DC vs CSK : అదే మా కొంపముంచింది.. ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ హాట్ కామెంట్స్..
మ్యాచ్ అనంతరం తమ జట్టు గెలుపు పై సీఎకే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి నిలకడైన ఆటగాడు తమ జట్టులో ఉండడం అదృష్టం అని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో చూపించిన ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడని తెలిపాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు ఢిల్లీ పై కఠినమైన పిచ్ పైన 87 పరుగులతో అజేయంగా నిలవడం చాలా బాగుందన్నాడు.
సీఎస్కే బౌలర్లు అఖీల్ హోసేన్, జేమీ ఓవర్టన్, అన్షుల్ లను కొనియాడాడు. వారు నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెలుతున్నారని చెప్పాడు. ఇక జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్, తాను సీజన్ ప్రారంభం నుంచి సానుకూల దృక్పథంతో ఉన్నామన్నాడు. ఇదే ఊపును కొనసాగించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెడతామనే ధీమాను వ్యక్తం చేశాడు.
