IPL 2026: ముకుల్ చౌదరి సూపర్ బ్యాటింగ్.. కోల్‌కతాపై లక్నోపై థ్రిల్లింగ్ విక్టరీ
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ, రహానె రాణించారు.
- Naveen
- Published On : April 9, 2026 / 11:20 PM IST
Pic Courtesy @ EspnCricInfo
IPL 2026: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. లక్నో బ్యాటర్ ముకుల్ చౌదరి సూపర్ బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడు. ఎవరూ ఊహించని రీతిలో ముకుల్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. హాఫ్ సెంచరీ బాదాడు. 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ లో మొత్తం 7 సిక్సర్లు ఉన్నాయి.
కోల్ కతా గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ముకుల్ చౌదరి ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. ధనాధన్ బ్యాటింగ్ తో లక్నోకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. మరో ఎండ్ లో ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ, రహానె రాణించారు. రఘువంశీ 33 బంతుల్లో 45 పరుగులు చేయగా, రహానె 24 బంతుల్లో 41 రన్స్ చేశాడు. చివరలో పావెల్ చెలరేగాడు. 24 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. కామెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులతో మెరిశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్, సిద్ధార్ధ్, దిగ్వేశ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. 182 పరుగుల టార్గెట్ ను లక్నో జట్టు 7 వికెట్లు కోల్పోయి చివరి బంతకి చేజ్ చేసింది.
