IPL 2026: బోణీ కొట్టిన లక్నో.. హైదరాబాద్ పై థ్రిల్లింగ్ విక్టరీ

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

  • Published On : April 5, 2026 / 07:11 PM IST

IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బోణీ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. హైదరాబాద్ ను వారి హోమ్ గ్రౌండ్ లో చిత్తు చేసింది లక్నో. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 157 పరుగుల టార్గెట్ ను మరో బంతి మిగిలి ఉండగానే లక్నో చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది. కాగా, ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. ఆఖరి బాల్ వరకు హైదరాబాద్ పోరాటం చేసింది. కానీ ఓటమి తప్పలేదు.

లక్నో బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 50 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టు విజయంలో పంత్ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఓపెనర్ మార్ క్రమ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది రెండో పరాజయం కాగా లక్నోకు తొలి విజయం.