IPL 2026: తిరుగులేని పంజాబ్.. చెన్నైపై ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
- Naveen
- Published On : April 3, 2026 / 11:23 PM IST
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చెన్నైపై ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల టార్గెట్ ను పంజాబ్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది వరుసగా రెండో విజయం కాగా, చెన్నైకి వరుసగా రెండో పరాజయం.
పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (43), ఆర్య (39), కూపర్ (36) రాణించారు. ఓపెనర్లు ఆర్య, సింగ్ పంజాబ్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
