Varun Chakaravarthy : వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచారని సంతోషించే లోపే.. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్..
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) గాయపడినట్లుగా తెలుస్తోంది.
Varun Chakaravarthy was seen on crutches and wearing leg braces ahead of KKR clash with RCB (pic credit@ipl)
- బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు షాక్
- గాయపడిన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
- బెంగళూరుతో మ్యాచ్ ఆడేది అనుమానమే
Varun Chakaravarthy : వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ క్రమంలో బుధవారం (మే 13న) ఆర్సీబీతో కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్ ముందు ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడినట్లుగా తెలుస్తోంది. అతడు నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో అతడు ఆర్సీబీతో మ్యాచ్ ఆడడం అనుమానాస్పదంగా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో వరుణ్ చక్రవర్తి హోటల్ లాబీలో నడుస్తూ కనిపించాడు. అందులో ఆయన తన ఎడమ కాలికి సపోర్టివ్ బ్రేస్ ధరించి, చేతిలో ఊతకర్ర పట్టుకుని నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది.
Andy Flower : ముంబై పై విజయం.. ఆర్సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
వాస్తవానికి గత వారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే వరుణ్ కు గాయమైంది. అయినప్పటికి కూడా అతడు తన 4 ఓవర్ల కోటాను ఇబ్బంది పడుతూనే పూర్తి చేశాడు. ఆ తరువాత అతడి స్థానంలో ఫిన్ అలెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. ఆ మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మిస్టరీ స్పిన్నర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. అతడు బాగానే ఉన్నాడని, అయితే మైదానంలోకి దిగేంత ఫిట్‌గా లేడని మాత్రం చెప్పుకొచ్చాడు.
Hope you feel better soon Varun Chakravarthy 🧿 🥹 pic.twitter.com/W6ZgCLtuai
— Dr Khushboo (@khushbookadri) May 10, 2026
తాజాగా వీడియోతో కేకేఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వరుణ్ గాయం కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను దెబ్బకొట్టవచ్చునని అంటున్నారు.
