IPL 2026: బోణీ కొట్టిన పంజాబ్.. గుజరాత్‌పై గెలుపు
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
- Naveen
- Published On : March 31, 2026 / 11:38 PM IST
IPL 2026: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లోనే గెలుపు బోణీ కొట్టింది పంజాబ్. 3 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 రన్స్ టార్గెట్ ను పంజాబ్
మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. పంజాబ్ బ్యాటర్లు కూపర్ కనోలి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లోనే 72 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ప్రభుసిమ్రన్ 24 బంతుల్లో 37 రన్స్ తో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. సుందర్, రషీద్, అశోక్ శర్మ, రబాడా తలో వికెట్ తీసుకున్నారు.
పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. గుజరాత్ జట్టులో సుదర్శన్ 13, గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25, సుందర్ 18 రన్స్ చేశారు. పంబాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాక్ 3 వికెట్లతో చెలరేగాడు. చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్ సెన్ ఒక వికెట్ తీశాడు.
