IPL 2026 : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్..

IPL 2026 : రోహిత్ శర్మ ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ కు ఆడాడు. ఆ తరువాత ముంబయి ఇండియన్స్‌కు మారాడు. అతని సారథ్యంలో ముంబయి ఇండియన్స్ జట్టు ఐదు టైటిళ్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

IPL 2026

  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
  • ఐపీఎల్ 19 సీజన్లలో ఆడిన ఏకైక క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు
  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో బౌండరీలతో రెచ్చిపోయిన రోహిత్

IPL 2026 : ఐపీఎల్ -2026 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ముంబయి ఇండియన్స్ (mumbai indians) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు రికెల్టన్ (81), రోహిత్ శర్మ (78) బ్యాటుతో విధ్వంసం సృష్టించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టుపై విజయం సాధించింది.

Also Read : IPL 2026 : ఫిల్ సాల్ట్ కళ్లుచెదిరే క్యాచ్.. ఏంది భయ్యా అలా పట్టేశావ్.. బాబోయ్.. మెంటలెక్కించాడు! వీడియో వైరల్

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్, ముంబయి ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.


రోహిత్ శర్మ ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడు. ఆ తరువాత ముంబయి ఇండియన్స్‌కు మారాడు. అతని సారథ్యంలో ముంబయి ఇండియన్స్ జట్టు ఐదు టైటిళ్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ జట్టులోని ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 19 సీజన్లలో ఆడిన ఏకైక క్యాప్డ్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ – 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ శర్మతో‌పాటు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, మనీష్ పాండేలు మాత్రమే 19 సీజన్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.


రోహిత్ శర్మ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఈ 19 సీజన్లలో ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు సీజన్లను అనామక ఆటగాడిగా (అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు గడిచిన ఆటగాళ్లను అనామక ప్లేయర్‌గా పరిగణించాలనే కొత్త రూల్‌ను బీసీసీఐ ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే) ఆడగా.. ఐపీఎల్ 2023 సీజన్ తరువాత ధోనీ అనామక ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు.

తాజాగా.. కేకేఆర్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టాడు.. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సుల సహాయంతో 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే రోహిత్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.