IPL 2026: కోల్ కతాపై హైదరాబాద్ ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది.

  • Published On : April 2, 2026 / 11:06 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయదుంధుబి మోగించింది. కోల్ కతాను 65 రన్స్ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. 227 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 29 బంతుల్లో 52 రన్స్ చేశాడు. రింకు సింగ్ (35), అలెన్ (28) మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగాడు. మలింగ, నితీశ్ చెరో రెండు వికెట్లు తీశారు. దూబె ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది తొలి విజయం కాగా, కోల్ కతాకు వరుసగా రెండో పరాజయం.