IPL auction 2024 : పాపం స్మిత్.. కనీస ధర రూ.2కోట్లు దెబ్బకొట్టిందా? వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ వీళ్లే

ఐపీఎల్ 2024 వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ కు నిరాశ ఎదురైంది. అత్యధిక ధర పలుకుతారని భావించిన కొందరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రాంచైజీలు ముందుకు రాలేదు.

Steve Smith

IPL 2024 Auction Steve Smith : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం ముగిసింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన‌ ఈ వేలంలో ఆట‌గాళ్ల‌పై కోట్ల వ‌ర్షం కురిసింది. మొద‌టి సారి భార‌తదేశం వెలుప‌ల జ‌రిగిన వేలంలో ప‌లువురు ఆట‌గాళ్లు రికార్డు ధ‌ర‌ల‌కు అమ్ముడు పోయారు. టోర్నీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల‌కు కోల్‌క‌తా సొంతం చేసుకోగా, పాట్ క‌మిన్స్‌ను రూ.20.50 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దక్కించుకుంది. ఆ త‌రువాత డారిల్ మిచెల్ రూ.14 కోట్ల‌కు చెన్నై కొనుగోలు చేసింది. ఈ వేలంలో పలువురి విదేశీ ఆటగాళ్లపై ప్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. మంగళవారం జరిగిన వేలంలో 10 ప్రాంచైజీలు మొత్తం 72 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. ఇందులో 30 విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

Also Read ; IPL auction 2024 : ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ జ‌ట్టు ఎవ‌రిని ఎంత ధ‌ర‌కు కొనుగోలు చేశాయంటే..? టాప్‌-5 ఆట‌గాళ్లు వీరే..

ఐపీఎల్ 2024 వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ కు నిరాశ ఎదురైంది. అత్యధిక ధర పలుకుతారని భావించిన కొందరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రాంచైజీలు ముందుకు రాలేదు. వీరిలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఒకరు. స్మిత్ కనీస ధర రూ. 2కోట్లు. అయితే, ప్రాంచైజీలు స్మిత్ ను రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో కొనుగోలు చేస్తారని భావించారు. కానీ, ప్రాంచైజీలు స్మిత్ ను పరిగణలోకి తీసుకోలేదు. వేలంకంటే ముందు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ప్లేయర్, సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ.. స్మిత్ ను ఎవరూ కొనుగోలు చేయరని చెప్పారు. అంతేకాక, ఆస్ట్రేలియా ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, కమిన్స్ లకు భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పారు. టామ్ మూడి చెప్పినట్లుగానే స్మిత్ నిరాశే ఎదురైంది. దీంతో పాపం స్మిత్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. స్మిత్ ను కొనుగోలు చేసేందుకు పలు ప్రాంచేజీలు తొలుత ఆసక్తి చూపినప్పటికీ కనీస ధర రూ.2కోట్లు పెట్టడం వల్లనే కొనుగోలుకు వెనుకడుగు వేశారని, ఒకవేళ కనీస ధర రూ. 50లక్షల నుంచి రూ. కోటి  వరకు ఉన్నట్లయితే స్మిత్ ను ప్రాంచైజీలు దక్కించుకునేవని కొందరు క్రికెటర్లు పేర్కొంటున్నారు.

Also Read : Kavya Maran : చాలా త‌క్కువ‌కు స్టార్ ప్లేయ‌ర్‌ను సొంతం చేసుకోగానే కావ్య మారన్ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌.. ఎవ‌రో తెలుసా..?

అమ్ముడుపోని టాప్ ప్లేయర్స్ వీళ్లే..
కనీసం ధర రూ.2కోట్ల ఆటగాళ్లు : స్టీవ్ స్మిత్, వాండర్ డసెన్, జోష్ ఇంగ్లిస్, జోష్ హేజిల్, ఆదిల్ రషీద్, జేమ్స్ విన్స్, సీన్ అబాట్, జేమీ ఓవర్ట్ న్, బెన్ డకెట్,
కనీసం ధర రూ.1.50కోట్ల ఆటగాళ్లు : ఫిలిప్ సాల్ట్, కాలీన్ మున్రో, జేసన్ హోల్డన్, జేమ్స్ నీషమ్, డానియల్ సామ్స్, క్రిస్ జోర్దాన్, టైమల్ మిల్స్, టిమ్ సౌథీ. వీరితో పాటు మరికొందరు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు