IPL auction 2024 : ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ జట్టు ఎవరిని ఎంత ధరకు కొనుగోలు చేశాయంటే..? టాప్-5 ఆటగాళ్లు వీరే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం ముగిసింది

IPL auction 2024 is over Full list of sold players are here
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. మొదటి సారి భారతదేశం వెలుపల జరిగిన వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడు పోయారు. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకోగా, పాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కింది. ఆ తరువాత డారిల్ మిచెల్ రూ.14 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.
ఏ జట్టు ఎవరెవరిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందంటే..?
కోల్‌కతా నైట్‌రైడర్స్..
మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు), ముజీబ్ రెహమాన్ (రూ.2 కోట్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (రూ.1.5కోట్లు), గుస్ అట్కిన్సన్ (రూ.కోటి), కేఎస్ భరత్ (రూ.50లక్షలు), చేతన్ సకారియా (రూ.50లక్షలు), రమణ్‌దీప్ సింగ్ (రూ.20లక్షలు), మనీశ్ పాండే (రూ.50లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.20లక్షలు)
ముంబై ఇండియన్స్..
గెరాల్డ్ కోయిట్జీ (రూ 5కోట్లు), నువాన్ తుషారా (రూ.4.80 కోట్లు), దిల్షాన్ మధుశంక (రూ 4.6 కోట్లు), మహ్మద్ నబీ (రూ.1.5 కోట్లు), శ్రేయాస్ గోపాల్ (రూ.20లక్షలు), నమన్ ధీర్ (రూ.20లక్షలు), అన్షుల్ కాంబోజ్ (రూ.20లక్షలు), శివాలిక్ శర్మ (రూ.20లక్షలు)
సన్ రైజర్స్ హైదరాబాద్..
పాట్ కమిన్స్ (రూ.20.50కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ 6.80కోట్లు), వనింద్ హసరంగ (రూ.1.50కోట్లు), జయదేవ్ ఉన్కదత్ (రూ.1.6 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ.20లక్షలు), జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ.20లక్షలు)
గుజరాత్ టైటాన్స్..
స్పెన్సర్ జాన్సన్ (రూ.10కోట్లు), ఉమేశ్ యాదవ్ (రూ.5.80కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ 7.4కోట్లు), రాబిన్ మింజ్ (రూ.3.6 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ. 60లక్షలు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ.50లక్షలు), సుశాంత్ మిశ్రా(రూ.20లక్షలు), మానవ్ సుతార్ (రూ.20 లక్షలు)
చెన్నై సూపర్ కింగ్స్..
డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు), సమీర్ రిజ్వి (రూ 8.4కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ.4కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.2కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.1.8కోట్లు), అవనీష్ రావు (రూ.20లక్షలు),
పంజాబ్ కింగ్స్ ఎలెవన్..
హర్షల్ పటేల్ (రూ.11.75కోట్లు), రిలీ రోసో (రూ.8కోట్లు), క్రిస్‌వోక్స్ (రూ.4.2కోట్లు), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ.20లక్షలు), అశుతోష్ శర్మ(రూ.20లక్షలు), శశాంక్ సింగ్ (రూ.20లక్షలు), తనయ్ త్యాగరాజన్ (రూ.20లక్షలు), ప్రిన్స్ చౌదరి (రూ.20లక్షలు)
Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. టీమ్ఇండియాకు కలిసొచ్చిన అదృష్టం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
అల్జారీ జోసెఫ్ (రూ.11.50కోట్లు), యశ్ దయాళ్ (రూ.5కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2కోట్లు), టామ్ కర్రాన్ (రూ.1.5కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20లక్షలు)
రాజస్థాన్ రాయల్స్..
రోవ్‌మన్ పావెల్ (రూ.7.40 కోట్లు), శుభమ్ దూబె (రూ 5.8 కోట్లు), నాంద్రే బర్గర్ (రూ.50లక్షలు), టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ.40 లక్షలు), అబిద్ ముస్తాక్ (రూ.20లక్షలు),
ఢిల్లీ క్యాపిటల్స్..
కుమార్ కుశాగ్రా (రూ.7.20 కోట్లు), జైల్ రిచర్డ్‌సన్ (రూ.5కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ.4కోట్లు), సుమిత్ కుమార్ (రూ.కోటి), షై హోప్ (రూ.75 లక్షలు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.50లక్షలు), రికీ భుయ్ (రూ.20లక్షలు), రాసిఖ్ దార్ (రూ.20లక్షలు), స్వస్తిక్ చికార (రూ.20లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్..
శివమ్ మామీ (రూ.6.40 కోట్లు), సిద్ధార్థ్ (రూ.2.40కోట్లు), డేవిడ్ విల్లీ (రూ.2కోట్లు), ఆస్టన్ టర్నర్(రూ.కోటి), అర్షిన్ కులకర్ణి (రూ 20లక్షలు), మొహమ్మద్ అర్షద్ ఖాన్ (రూ.20లక్షలు)
WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాలని ఇన్ని రోజులు తెలియదు భయ్యా..! వీడియో వైరల్
The last player for the day – Saurav Chauhan is SOLD to @RCBTweets for INR 20 Lakh!
AND that concludes the #IPLAuction 2024! ?
The 10 teams are ready for the upcoming #IPL season ?
— IndianPremierLeague (@IPL) December 19, 2023