Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. టీమ్ఇండియాకు క‌లిసొచ్చిన అదృష్టం

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను పాకిస్తాన్ ఓట‌మితో మొద‌లుపెట్టింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఘోర ఓట‌మిని చ‌విచూసింది.

Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. టీమ్ఇండియాకు క‌లిసొచ్చిన అదృష్టం

India achieve top spot in WTC 2023-2025 points table

India achieve top spot : ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను పాకిస్తాన్ ఓట‌మితో మొద‌లుపెట్టింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఏకంగా 360 ప‌రుగుల భారీ తేడాతో ఓడిపోయింది. నాలుగో రోజు 449 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 30.2 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వార్న‌ర్ (164), మిచెల్ మార్ష్ (90) లు రాణించ‌డంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 ప‌రుగులు చేసింది. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లతో రాణించాడు. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 271 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో ఇమామ్ ఉల్ హ‌క్ (62)హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. దీంతో ఆసీస్‌కు 216 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ల‌భించింది.

Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ పై ఒకే ఒక్క‌డు

ఆ త‌రువాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 233/5 వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్‌ ఖ‌వాజా (90), మిచెల్‌ మార్ష్‌ (63 నాటౌట్‌) రాణించారు. మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకుంటే పాక్ ముందు 449 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌వుడ్ లు చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబ‌ర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

అగ్ర‌స్థానానికి చేరిన భార‌త్‌..

ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ మొద‌టి టెస్టు మ్యాచులో ఓడిపోవ‌డం టీమ్ఇండియాకు క‌లిసివ‌చ్చింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2023-25 పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్‌ అగ్ర‌స్థానానికి చేరుకుంది. నిన్న‌టి వ‌ర‌కు అగ్ర‌స్థానంలో ఉన్న పాక్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో రెండో స్థానానికి ప‌డిపోయింది. డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు టెస్టు మ్యాచులు ఆడింది. ఓ మ్యాచులో విజ‌యం సాధించిన భార‌త్ మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

 

భార‌త్ 66.67 విజ‌య శాతంతో 16 పాయింట్లు క‌లిగింది. పాకిస్తాన్ మూడు మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లో గెలిచి ఓ మ్యాచులో ఓడింది. 66.67 విజ‌య‌శాతంతో 24 పాయింట్లు పాకిస్తాన్ ఖాతాలో ఉన్నాయి. ఆ త‌రువాత మూడో స్థానంలో న్యూజిలాండ్‌, నాలుగులో బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఆ త‌రువాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక‌లు వ‌రుస‌గా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

Ishan Kishan : ఇషాన్ కిష‌న్‌కు షాక్‌.. ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి త‌ప్పించిన‌ బీసీసీఐ.. ఎందుకంటే..?

విజ‌య‌శాతం ఆధారంగా డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో ర్యాంకుల‌ను నిర్ణ‌యిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే.