IPL Franchises: ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతి భారీ ఆఫర్లు.. షరతులు?

IPL Franchises: టైమ్స్ లండన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇస్తున్న ఆఫర్ల గురించి తెలిపింది.

IPL Franchises: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇస్తున్న ఆఫర్ల గురించి టైమ్స్ లండన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ క్రికెట్ ను వదిలేసి తమ జట్ల తరఫున ఏడాది పొడవునా ఆడితే భారీ మొత్తానికి వార్షిక కాంట్రాక్టులు కుదుర్చుకోవచ్చని ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఐపీఎల్ లోని టాప్ ఫ్రాంచైజీ యజమానులు ఆఫర్లు ఇస్తున్నారని పేర్కొంది.

ఈ మేరకు ఆ ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న విషయం తెలిసిందే.

దాదాపు ఈ 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరికొన్ని లీగ్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సీపీఎల్ (West Indies), ఎస్ఏ టీ20 (South Africa), గ్లోబల్ టీ20 లీగ్ (UAE), అమెరికాలో నిర్వహించనున్న టీ20 లీగ్ లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఐపీఎల్ లోని టాప్ ఫ్రాంచైజీలు దాదాపు రూ.50.92 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నాయని తెలిపింది.

అయితే, ఆ ఆరుగులు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరు? ఏయే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అనే వివరాలను తెలపలేదు. ఆరుగులు ఇంగ్లండ్ ఆటగాళ్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు చర్చలు జరుపుతున్నాయని మాత్రమే పేర్కొంది. అంతేగాక, ఇటువంటి చర్చలే ఆస్ట్రేలియా టీ20 ఆటగాళ్లతోనూ జరుగుతున్నాయని చెప్పింది. కాగా, ఇటువంటి 12 నెలల ఫ్రాంచైజీ కాంట్రాక్టు.. ఫుట్ బాల్ మోడల్ కాంట్రాక్టులను పోలి ఉందని చర్చ జరుగుతోంది.

IPL 2023, RR vs CSK: బ్యాటింగ్ ఆరంభం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే య‌శ‌స్వి జైశ్వాల్ దూకుడు.. Live Updates

ట్రెండింగ్ వార్తలు