IPL 2023, RR vs CSK: చెన్నై పై రాజ‌స్థాన్ విజ‌యం

IPL 2023, RR vs CSK:ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023, RR vs CSK: చెన్నై పై రాజ‌స్థాన్ విజ‌యం

RR vs CSK

IPL 2023, RR vs CSK: ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా రుతురాజ్ గైక్వాడ్(47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా మూడు వికెట్లు తీయ‌గా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 27 Apr 2023 11:12 PM (IST)

    రాజ‌స్థాన్ విజ‌యం

    ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

  • 27 Apr 2023 11:06 PM (IST)

    శివ‌మ్ దూబే అర్ధ‌శత‌కం

    శివ‌మ్ దూబే అర్ధ‌శత‌కం పూర్తి చేసుకున్నాడు. జేస‌న్ హోల్డ‌ర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 19 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 166/5. శివ‌మ్ దూబే(50), ర‌వీంద్ర జ‌డేజా(21) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 11:00 PM (IST)

    జ‌డేజా రెండు ఫోర్లు

    18వ ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. జ‌డేజా రెండు ఫోర్లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 12 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 157/5. శివ‌మ్ దూబే(48), ర‌వీంద్ర జ‌డేజా(14) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:56 PM (IST)

    దూబే రెండు ఫోర్లు, ఓ సిక్స్‌

    17వ ఓవ‌ర్‌ను జేస‌న్ హోల్డ‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో దూబే రెండు ఫోర్ల‌తో పాటు ఓ సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 16 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 145/5. శివ‌మ్ దూబే(46), ర‌వీంద్ర జ‌డేజా(4) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:47 PM (IST)

    4 ప‌రుగులు

    16వ ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 4 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 129/5. శివ‌మ్ దూబే(31), ర‌వీంద్ర జ‌డేజా(3) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:43 PM (IST)

    మోయిన్ ఔట్‌

    చెన్నై మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న మోయిన్ అలీ (12 బంతుల్లో 23) ఔటైయ్యాడు. జంపా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ సంజు శాంస‌న్ క్యాచ్ ప‌ట్ట‌డంతో మోయిన్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో చెన్నై 124 ప‌రుగుల(14.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.15 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 125/5. శివ‌మ్ దూబే(29), ర‌వీంద్ర జ‌డేజా(1) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:36 PM (IST)

    దూబే రెండు సిక్స్‌లు

    దూబే క్ర‌మంగా దూకుడు పెంచాడు. అశ్విన్ 14వ ఓవ‌ర్ వేయ‌గా తొలి రెండు బంతుల‌కు వ‌రుస‌గా రెండు సిక్స్‌లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 113/4. శివ‌మ్ దూబే(22), మోయిన్ అలీ(19) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:32 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న‌ మోయిన్ అలీ

    మోయిన్ అలీ దూకుడుగా ఆడుతున్నాడు. చాహ‌ల్ వేసిన ప‌ద‌మూడో ఓవ‌ర్‌లో ఆఖ‌రి రెండు బంతుల‌ను 6, 4 గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 98/4. శివ‌మ్ దూబే(8), మోయిన్ అలీ(18) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:28 PM (IST)

    మోయిన్ అలీ సిక్స్‌

    జేస‌న్ హోల్డ‌ర్ వేసిన 12వ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి మోయిన్ అలీ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 85/4. శివ‌మ్ దూబే(5), మోయిన్ అలీ(8) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:23 PM (IST)

    రాయుడు ఔట్‌

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. ప‌ద‌కొండో ఓవ‌ర్ వేసిన అశ్విన్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి ర‌హానేను ఔట్ చేయ‌గా నాలుగో బంతికి హోల్డ‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో రాయుడు(0) పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 73 ప‌రుగుల‌కే చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 11 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 73/4. శివ‌మ్ దూబే(2), మోయిన్ అలీ(0) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:20 PM (IST)

    ర‌హానే ఔట్‌

    చెన్నై మ‌రో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో ర‌హానే(15) భారీ షాట్‌కు య‌త్నించ‌గా బ‌ట్ల‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 73 ప‌రుగుల(10.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.

  • 27 Apr 2023 10:17 PM (IST)

    గైక్వాడ్ ఔట్‌

    ధాటిగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. 47 ప‌రుగులు చేసిన రుతురాజ్ ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 69 ప‌రుగుల(9.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 71/2. శివ‌మ్ దూబే(1), అజింక్యా ర‌హానే(15) క్రీజులో ఉన్నారు

  • 27 Apr 2023 10:10 PM (IST)

    9 ప‌రుగులు

    ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 68/1. రుతురాజ్ గైక్వాడ్(47), అజింక్యా ర‌హానే(13) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:06 PM (IST)

    గైక్వాడ్ ఫోర్‌

    పేసర్ కుల్దీప్ యాద‌వ్ ఎనిమిద‌వ ఓవ‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 59/1. రుతురాజ్ గైక్వాడ్(46), అజింక్యా ర‌హానే(5) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 10:01 PM (IST)

    8 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేశాడు. తొలి బంతికి గైక్వాడ్ ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 50/1. రుతురాజ్ గైక్వాడ్(40), అజింక్యా ర‌హానే(2) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:56 PM (IST)

    కాన్వే ఔట్‌

    ప‌రుగులు చేసేందుకు ఇబ్బందులు ప‌డుతున్న కాన్వే(8) ఔట్ అయ్యాడు. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో సందీప్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్ట‌డంతో చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 42/1. రుతురాజ్ గైక్వాడ్(34), అజింక్యా ర‌హానే(0) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:50 PM (IST)

    10 ప‌రుగులు

    నాలుగో ఓవ‌ర్‌ను అశ్విన్ వేయ‌గా నాలుగో బంతికి గైక్వాడ్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 35/0. రుతురాజ్ గైక్వాడ్(28), డెవాన్ కాన్వే(7) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:47 PM (IST)

    గైక్వాడ్ సిక్స్‌, ఫోర్‌

    రుతురాజ్ గైక్వాడ్ వేగం పెంచాడు. జేస‌న్ హోల్డ‌ర్ వేసిన నాలుగో ఓవ‌ర్‌లోని ఆఖ‌రి రెండు బంతుల‌ను ఫోర్‌, సిక్స్‌గా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 25/0. రుతురాజ్ గైక్వాడ్(19), డెవాన్ కాన్వే(6) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:42 PM (IST)

    నిదానంగా ఆడుతున్న కాన్వే, గైక్వాడ్

    చెన్నై ఓపెన‌ర్లు కాన్వే, గైక్వాడ్ లు నిదానంగా ఆడుతున్నారు. మూడో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 3 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 13/0. రుతురాజ్ గైక్వాడ్(8), డెవాన్ కాన్వే(5) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:38 PM (IST)

    5 ప‌రుగులు

    రెండో ఓవ‌ర్‌ను పేస‌ర్‌ కుల్‌దీప్ యాద‌వ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 12/0. రుతురాజ్ గైక్వాడ్(7), డెవాన్ కాన్వే(5) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 09:33 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై బ‌రిలోకి దిగింది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. ఆఖ‌రి బంతికి కాన్వే ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 7 ప‌రుగులు వ‌చ్చాయి.

  • 27 Apr 2023 09:13 PM (IST)

    చెన్నై ల‌క్ష్యం 203

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌(77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దేవదత్ పడిక్కల్(27 నాటౌట్‌; 13 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడ‌డంతో స్కోరు 200 ప‌రుగులు దాటింది. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీయ‌గా మ‌హేశ్ తీక్ష‌ణ‌, ర‌వీంద్ర జ‌డేజా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 27 Apr 2023 09:04 PM (IST)

    16 ప‌రుగులు

    తుషార్ దేశ్‌పాండే 19వ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ప‌డిక్క‌ల్ ఓ ఫోర్ కొట్ట‌గా ధ్రువ్ జురెట్ ఓ సిక్స్‌, ఫోర్ బాద‌డంతో మొత్తంగా 16 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 182/4. ధ్రువ్ జురెల్(23), దేవదత్ పడిక్కల్(20) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:59 PM (IST)

    ప‌డిక్క‌ల్ రెండు ఫోర్లు

    పతిరణ వేసిన 18వ ఓవ‌ర్‌లో ప‌డిక్క‌ల్ రెండు ఫోర్లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 166/4. ధ్రువ్ జురెల్(12), దేవదత్ పడిక్కల్(15) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:53 PM (IST)

    హెట్మెయర్ ఔట్‌

    రాజ‌స్థాన్ మ‌రో వికెట్‌ను కోల్పోయింది. మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో హెట్మెయర్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ 146 ప‌రుగుల(16.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 153/4. ధ్రువ్ జురెల్(9), దేవదత్ పడిక్కల్(5) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:49 PM (IST)

    ధ్రువ్ జురెల్ ఫోర్‌

    పతిరణ వేసిన 16వ ఓవ‌ర్‌లో ధ్రువ్ జురెల్ ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 146/3. ధ్రువ్ జురెల్(8), షిమ్రాన్ హెట్మెయర్(8) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:45 PM (IST)

    7 ప‌రుగులు

    ఒకే ఓవ‌ర్‌లో సంజు శాంస‌న్‌, జైశ్వాల్ ఔట్ కావ‌డంతో ప‌రుగుల వేగం త‌గ్గింది. 15వ ఓవ‌ర్ మోయిన్ అలీ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 139/3. ధ్రువ్ జురెల్(2), షిమ్రాన్ హెట్మెయర్(8) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:39 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో సంజు శాంస‌న్‌, జైశ్వాల్ ఔట్‌

    ఒకే ఓవ‌ర్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 14వ‌ ఓవ‌ర్‌ను తుషార్ దేశ్‌పాండే వేయ‌గా తొలి బంతికి సంజు శాంస‌న్ ఔట్ కాగా ఐదో బంతికి జైశ్వాల్‌(77) ర‌హానే అద్భుత‌మైన క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 132 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 132/3. ధ్రువ్ జురెల్(0), షిమ్రాన్ హెట్మెయర్(3) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:34 PM (IST)

    సంజు శాంస‌న్ ఔట్‌

    రాజ‌స్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. సంజు శాంస‌న్(17) ఔట్ అయ్యాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవ‌డంతో సంజు ఇన్నింగ్స్ ముగిసింది. 125 ప‌రుగుల(13.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద రాజ‌స్థాన్ రెండో వికెట్ ప‌డింది.

  • 27 Apr 2023 08:31 PM (IST)

    చెరో ఫోర్‌

    ప‌దమూడో ఓవ‌ర్‌ను ర‌వీంద్ర జ‌డేజా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో సంజు శాంస‌న్‌, జైశ్వాల్‌లు చెరో ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 125/1. యశస్వి జైస్వాల్(73), సంజు శాంస‌న్‌(17) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:28 PM (IST)

    నిల‌కడ‌గా ఆడుతున్న శాంస‌న్‌, జైశ్వాల్

    సంజు శాంస‌న్‌, జైశ్వాల్‌ను నిదానంగా ఆడుతున్నారు. 12వ ఓవ‌ర్‌ను పతిరణ వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 113/1. యశస్వి జైస్వాల్(66), సంజు శాంస‌న్‌(12) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:21 PM (IST)

    4 ప‌రుగులు

    ర‌వీంద్ర జ‌డేజా వేసిన ప‌ద‌కొండో ఓవ‌ర్‌లో 4 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 104/1. యశస్వి జైస్వాల్(63), సంజు శాంస‌న్‌(7) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:18 PM (IST)

    జైశ్వాల్ సిక్స్‌

    ప‌దో ఓవ‌ర్‌ను మోయిన్ అలీ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి జైశ్వాల్ సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 100/1. యశస్వి జైస్వాల్(61), సంజు శాంస‌న్‌(5) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:11 PM (IST)

    బ‌ట్ల‌ర్ ఔట్‌

    బ‌ట్ల‌ర్ ఔట్(27) అయ్యాడు. జ‌డేజా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ భారీ షాట్ కొట్ట‌గా లాంగాన్‌లో ఉన్న శివ‌మ్ దూబే చేతికి చిక్కాడు. దీంతో 86 ప‌రుగుల(8.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద రాజ‌స్థాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 90/1. యశస్వి జైస్వాల్(54), సంజుశాంస‌న్‌(2) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:08 PM (IST)

    10 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 85/0. యశస్వి జైస్వాల్(52), జోస్ బట్లర్‌(27) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:05 PM (IST)

    య‌శ‌స్వి జైశ్వాల్ అర్ధ‌శ‌త‌కం

    జ‌డేజా బౌలింగ్‌లో ఓ సిక్స్ కొట్టిన జైశ్వాల్ ఆఖ‌రి బంతికి సింగిల్ తీసి 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో జైశ్వాల్‌కు ఇది ఆరో హాఫ్ సెంచ‌రీ. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 75/0. యశస్వి జైస్వాల్(50), జోస్ బట్లర్‌(24) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 08:00 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    రాజ‌స్థాన్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. బ‌ట్ల‌ర్ ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 64/0. యశస్వి జైస్వాల్(40), జోస్ బట్లర్‌(23) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:57 PM (IST)

    జైశ్వాల్ సిక్స్‌

    ఐదో ఓవ‌ర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఈ ఓవ‌ర్‌లో జైశ్వాల్ ఓ సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా 9 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 54/0. యశస్వి జైస్వాల్(39), జోస్ బట్లర్‌(14) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:51 PM (IST)

    3 ప‌రుగులు

    నాలుగో ఓవ‌ర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 3 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 45/0. యశస్వి జైస్వాల్(31), జోస్ బట్లర్‌(13) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:46 PM (IST)

    జైశ్వాల్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌

    జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆకాశ్ సింగ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 18 పరుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 42/0. యశస్వి జైస్వాల్(31), జోస్ బట్లర్‌(11) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:41 PM (IST)

    బ‌ట్ల‌ర్ రెండు ఫోర్లు

    రెండో ఓవ‌ర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఈ ఓవ‌ర్‌లో బ‌ట్ల‌ర్ రెండు ఫోర్లు కొట్ట‌డంతో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 24/0. యశస్వి జైస్వాల్(13), జోస్ బట్లర్‌(11) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:35 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో య‌శ‌స్వి జైశ్వాల్ మూడు ఫోర్లు

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. మొద‌టి ఓవ‌ర్‌ను ఆకాశ్ సింగ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో జైశ్వాల్ మొత్తం మూడు బౌండ‌రీలు కొట్టాడు. మొద‌టి ఓవ‌ర్‌కు రాజ‌స్థాన్ స్కోరు 14/0. యశస్వి జైస్వాల్(13), జోస్ బట్లర్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2023 07:07 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్‌

  • 27 Apr 2023 07:06 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు

    యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

  • 27 Apr 2023 07:05 PM (IST)

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్‌

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ధోని సేన తొలుత బౌలింగ్ చేయ‌నుంది.