IPL Mega Auction 2025 Bhuvaneshwar Kumar Sold to RCB
ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్ తగిలింది. మెగా వేలంలో అతడికి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఏకంగా రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని సొంతం చేసుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.
రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో భువీ వేలంలో అడుగుపెట్టాడు. తొలుత అతడి కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు పోటీ పడ్డాయి. రూ.9 కోట్ల వరకు పాటను పెంచాయి. ఆ తరువాత లక్నో రూ.10 కోట్లకు తీసుకువెళ్లింది. దీంతో రేసులోంచి ముంబై తప్పుకుంది.
Virat Kohli : అకాయ్ కోహ్లీ పిక్ ఇదేనా? అసలు నిజం చెప్పిన కోహ్లీ సోదరి.. ఎంతపనాయరా?
అయితే.. అనూహ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులోకి వచ్చింది. 75 లక్షలు పెంచి రూ.10.75 కోట్లకు భువీని దక్కించుకుంది.
2014 నుంచి భువనేశ్వర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో ఎస్ఆర్‌హెచ్ ఛాంపియన్‌గా నిలవడంలో భువీ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో ఏకంగా 23 వికెట్లతో దుమ్ములేపాడు. అయితే.. గత కొంతకాలంగా అతడు వికెట్లు తీయడంలో విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలో అతడిని ఎస్ఆర్ హెచ్ వేలానికి వదిలివేసింది. అంతేకాదు వేలంలో అతడి కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు.
Stealth with moves like a panther, Bhuvneshwar Kumar is #NowAChallenger. 🥶
Are you ready to witness Poetry in Motion? 😍 #PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/VEtsd6P9R9
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024