Ipl2022 Gt Vs Srh
IPL2022 GT Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 163 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్ సెన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.(IPL2022 GT Vs SRH)
IPL2022 RR Vs LSG : లక్నో జైత్రయాత్రకు బ్రేక్.. ఉత్కంఠపోరులో రాజస్తాన్ గెలుపు
కాగా.. పేలవమైన బౌలింగ్.. చెత్త ఫీల్డింగ్.. క్యాచ్ డ్రాప్స్.. హైదరాబాద్ తప్పిదాలు గుజరాత్ జట్టుకి కలిసొచ్చాయి. గుజరాత్ చేసిన 162 పరుగుల్లో ఎక్స్‌ట్రా రూపంలోనే 22 పరుగులు వచ్చాయి. అయితే, ఫీల్డర్లు వరుసగా క్యాచ్ లు వదిలినప్పటికీ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ, గుజరాత్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దాంతో భారీ స్కోరు సాధించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో 162 పరుగులే చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య (50*), అభినవ్ మనోహర్ (35) తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు.
Innings Break!
50* from the Skipper propels @gujarat_titans to a total of 162/7 on the board.
Scorecard – https://t.co/phXicAbLCE #SRHvGT #TATAIPL pic.twitter.com/YEc9CTCgOH
— IndianPremierLeague (@IPL) April 11, 2022
డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. గుజరాత్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ఈ సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచులో కూడా ఓడిపోలేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది అజేయంగా కొనసాగుతోంది. మరోవైపు, రెండు వరుస పరాజయాలతో ఈ సీజన్‌ను ఆరంభించిన హైదరాబాద్ జట్టు మూడో మ్యాచులో చెన్నై జట్టుని ఓడించి.. గాడిలో పడినట్లే కనిపిస్తోంది. తాజా మ్యాచ్ లో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించి గుజరాత్ జట్టుని అడ్డుకుంటుందేమో చూడాలి.
IPL 2022 Season 15: ఐపీఎల్‌లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్
తుది జట్ల వివరాలు..
హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠీ, మార్‌క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్‌సెన్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
గుజరాత్ : శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమి, దర్శన్ నల్కండే
Our Top Performer from the first innings is @hardikpandya7 for his fine knock of 50* off 42 deliveries.#TATAIPL #SRHvGT pic.twitter.com/RpgWHNpXEx
— IndianPremierLeague (@IPL) April 11, 2022