IPL2022 KKR Vs MI : కోల్‌కతాను బెంబేలెత్తించిన బుమ్రా.. ముంబై టార్గెట్ ఎంతంటే..

Ipl2022 Kkr Vs Mi

IPL2022 KKR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. ముంబై ముందు 166 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

కోల్ కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43 పరుగులు), నితీశ్ రానా (26 బంతుల్లో 43 పరుగులు) రాణించారు. రహానె(25), రింకూ సింగ్(23*) పరుగులు చేశారు. ముగ్గురు(పాట్ కమిన్స్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ) డకౌట్ అయ్యారు. ముంబై బౌలర్లలో కుమార్ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టాడు. మురుగన్‌ అశ్విన్‌, డానియల్ సామ్స్ చెరో వికెట్‌ తీశారు. ఒకే ఓవర్‌లో రస్సెల్‌తోపాటు నితీశ్ రానా (43)ను బుమ్రా ఔట్‌ చేశాడు. భారీ షాట్‌కు యత్నించి రస్సెల్ బౌండరీ లైన్‌ దగ్గర పొలార్డ్‌ చేతికి.. అద్భుతమైన షార్ట్‌పిచ్‌ బంతికి నితీశ్‌ రానా కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు.

IPL 2022: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన ముంబై కెప్టెన్ రోహిత్ బౌలింగ్‌ ఎంచుకుని కోల్‌కతాకు బ్యాటింగ్‌ అప్పగించాడు. ఇప్పటివరకు ముంబై కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టాలని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన ముంబై 8 మ్యాచులు ఓడింది. పాయింట్ల పట్టికలో(4) అట్టడుగు స్థానంలో ఉంది.

IPL2022 KKR Vs MI Mumbai Indians Target 166

మరోవైపు ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్‌కతా ప్రతి మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించాలి. ఈ క్రమంలో కోల్‌కతా ఆశలకు ముంబై గండి కొడుతుందో.. లేకపోతే మరోసారి ఓటమి బాట పడుతుందో చూడాలి. అయితే మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ ముంచేతి కండరాల గాయంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం ముంబైకి పెద్ద లోటే. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా..4 విజయాలు నమోదు చేసింది. 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

IPL2022 DC Vs CSK : కీలక పోరులో ఢిల్లీకి షాక్.. చెన్నై ఘన విజయం

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ : ఇషాన్‌ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రమన్‌దీప్‌ సింగ్‌, కీరన్‌ పొలార్డ్, టిమ్‌ డేవిడ్, డానియల్ శామ్స్‌, మురుగన్‌ అశ్విన్, కుమార్‌ కార్తికేయ, బుమ్రా, మెరెడిత్‌.

కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానె, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్‌ రానా, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్‌ జాక్‌సన్, టిమ్‌ సౌథీ, ప్యాట్ కమిన్స్‌, వరుణ్ చక్రవర్తి.