IPL2022 PBKS Vs SRH : చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు.. పంజాబ్ 151 ఆలౌట్

ఉమ్రాన్‌ మాలిక్ వేసిన చివరి ఓవర్ లో ఒక్క పరుగు రాకుండా నాలుగు వికెట్లు పడ్డాయ్‌. అందులో ఒకటి రనౌట్‌.

Ipl2022 Pbks Vs Srh

IPL2022 PBKS Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ కెప్టెన్ ధావన్ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు.

Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్, భువనేశ్వర్‌ చెలరేగిపోయారు. ఆరంభం, ఆఖర్లో పంజాబ్‌ను కట్టడి చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. మరీ ముఖ్యంగా ఉమ్రాన్‌ మాలిక్ వేసిన చివరి ఓవర్లో ఒక్క పరుగు రాకుండా నాలుగు వికెట్లు పడ్డాయ్‌. అందులో ఒకటి రనౌట్‌ కాగా.. ఉమ్రాన్‌ మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు.(IPL2022 PBKS Vs SRH)

Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

పంజాబ్ బ్యాటర్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్‌కు పంజాబ్‌ 152 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్‌ ఖాన్‌ (26) ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్‌ 8, ప్రభుదేశాయ్‌ 14, జానీ బెయిర్‌స్టో 12, జితేశ్‌ శర్మ 11, ఓడియన్‌ స్మిత్ 13 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్ 4 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. నటరాజన్‌, సుచిత్ తలో వికెట్ తీశారు.

Dinesh Karthik: “టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నా”

ఈ సీజన్ లో ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి జోరుమీదుంది హైదరాబాద్‌. మరోవైపు పంజాబ్‌ కూడా ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలు, 2 ఓటములతో కొనసాగుతున్నా నెట్‌రన్‌రేట్‌ పరంగా హైదరాబాద్‌ కన్నా ముందుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని హైదరాబాద్ భావిస్తోంది. కాగా, గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఆడటం లేదు.

హైదరాబాద్‌ : అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీశ్‌ సుచరిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, టి.నటరాజన్‌

పంజాబ్‌ ‌: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఒడియన్‌ స్మిత్‌, కగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ ఆరోరా, అర్ష్‌దీప్‌ సింగ్‌