IPL2022 RR Vs DC : రాణించిన అశ్విన్, పడిక్కల్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే
రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.

Ipl2022 Rr Vs Dc
IPL2022 RR Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 161 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
IPL 2022: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..
యశస్వీ జైస్వాల్ (19) ఫర్వాలేదనిపించాడు. మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్ (7) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్ (3*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.

IPL2022 RR Vs DC Delhi Capitals Target 161
టీ20 లీగ్‌లో చాలా వరకు మ్యాచులు ముగిశాయి. దీంతో టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక జట్ల విషయానికొస్తే.. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా
రాజస్తాన్ రాయల్స్ జట్టు : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, డస్సెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, కుల్‌దీప్ సేన్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్‌దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్జే.
Chetan Sakariya is our Top Performer from the first innings for his bowling figures of 2/23.
A look at his bowling summary here ?? #TATAIPL #RRvDC pic.twitter.com/DGGQ4OgwgS
— IndianPremierLeague (@IPL) May 11, 2022