IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా

ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో 14 మ్యాచ్‌లకు ముందే ప్లేఆఫ్స్‌పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై 91పరుగుల తేడాతో గెలవడంతో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా

Ipl Play Off

IPL 2022:  ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో 14 మ్యాచ్‌లకు ముందే ప్లేఆఫ్స్‌పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై 91పరుగుల తేడాతో గెలవడంతో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

ముంబై ఇండియన్స్: ఏటా లీగ్ దశను ఆలస్యంగా ఆరంభించినా.. చివర్లో మెరిసేది. ఈ సారి ఆ అవకాశాల్లేనట్లే కనిపించింది. ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు అధికారికంగా నిష్క్రమించినట్లు అయింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచినా ఐదో స్థానానికి మాత్రమే చేరుకుంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్: ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం 3.4 శాతంగా ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిస్తే మాత్రం ధోనీసేన సంయుక్తంగా నాలుగో స్థానం లేదా మూడో స్థానానికి చేరే అవకాశం కనిపిస్తుంది. మూడో స్థానం చేరేందుకు అవకాశం కేవలం 0.3 శాతమే. 4 నుంచి ఏడు స్థానాల మధ్య ఉండే అవకాశాలే మెరుగ్గా కనిపిస్తున్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్: సోమవారం జరిగిన మ్యాచ్‌‌ తర్వాత కో‌ల్‌కతా నైట్ రైడర్స్ టాప్-4లో నిలిచే అవకాశాలు 2.9శాతం నుంచి 5.9శాతానికి పెరిగాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 10 పాయింట్లు దక్కించుకుని సూపర్ స్పీడ్ గా కనిపిస్తుంది.

పంజాబ్ కింగ్స్: టాప్-4లో నిలిచే అవకాశాలు పంజాబ్ జట్టుకు 25 శాతం ఉన్నాయి. ఆ జట్టు అన్నింటిలోనూ సక్సెస్ అయితే నాలుగు లేదంటే సంయుక్తంగా మూడు.. రెండో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ, పాయింట్ల పట్టికలో టాప్ 1కు చేరే అవకాశమే లేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఆదివారం ఆర్సీబీ చేతిలో ఓడిన తర్వాత సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు 42.5 శాతం నుంచి 21.2 శాతానికి పడిపోయాయి. చెన్నై చేతిలో ఢిల్లీ ఓడాక.. సన్‌రైజర్స్ అవకాశాలు 41.4 శాతం నుంచి 23 శాతానికి తగ్గాయి. ప్లేఆఫ్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం తప్పక సాధించాలి. టాప్ 1కు చేరే అవకాశమే లేదు.

ఆర్సీబీ: సన్‌రైజర్స్‌పై విజయం తర్వాత ఆర్సీబీ ప్లేఆఫ్ చేరే అవకాశాలు 63 శాతం నుంచి 89.6 శాతానికి పెరిగాయి. ఇకపై జరిగే మ్యాచ్ లలో దారుణంగా ఆడినా ఆరో స్థానం మాత్రం ఖాయం.

ఆర్ఆర్: రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో నిలిచేందుకు అవకాశాలెక్కువ. 95.9శాతం పాజిటివ్ గా కనిపిస్తుంది. దారుణంగా ఆడి మిగిలిన మ్యాచ్ లన్నింటిలో వైఫల్యానికి గురైనా ఆరో స్థానం ఖాయం.

లక్నో, గుజరాత్ టైటాన్స్, ప్లేఆఫ్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మిగిలిన మ్యాచ్ ల ఫలితాలపైనే టాప్-4 స్థానాలు ఆధారపడి ఉన్నాయి.