Ipl2022 Rr Vs Rcb
IPL2022 RR Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరుకి 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి రాణించాడు. హాఫ్ సెంచరీ బాదాడు. ఆఖరిలో బట్లర్ దంచి కొట్టాడు. 47 బంతుల్లోనే 70 పరగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బట్లర్ స్కోర్ లో 6 సిక్సులు ఉన్నాయి. షిమ్రోన్ హెట్ మైర్(31 బంతుల్లో 42 పరుగులు), దేవ్ దత్ పడిక్కల్(29 బంతుల్లో 37 పరుగులు) రాణించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4), కెప్టెన్ సంజూ శాంసన్ (8) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.(IPL2022 RR Vs RCB)
IPL2022 SH Vs LSG : చివర్లో చేతులెత్తేసిన హైదరాబాద్.. వరుసగా రెండో ఓటమి.. లక్నో ఖాతాలో మరో విజయం
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో రాజస్తాన్ జట్టు స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. పదో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ ఔట్ కాగా.. వనిందు హసరంగ వేసిన 12వ ఓవర్లో కెప్టెన్ సంజూ శాంసన్ (8) రిటర్న్ క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రాజస్తాన్ బ్యాటర్లు పవర్ ప్లే పూర్తయ్యాక కాస్త వేగం పెంచారు. ఆకాశ్ దీప్ వేసిన ఏడో ఓవర్లో ఐదో బంతిని ఓపెనర్ జోస్ బట్లర్ (31) భారీ సిక్సర్‌గా మలుచగా.. ఆ తర్వాతి ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ ఓ ఫోర్, ఓ సిక్స్ బాదాడు. వనిందు హసరంగ వేసిన తొమ్మిదో ఓవర్లో ఆఖరు బంతికి బట్లర్ మరో సిక్స్ బాదాడు. పదో ఓవర్లో ఆఖరు బంతిని భారీ సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్ (37) కోహ్లీకి చిక్కి క్రీజు వీడాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. డేవిడ్ విల్లే వేసిన రెండో ఓవర్లో ఐదో బంతికి ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4) బౌల్డయ్యాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొందిన రాజస్తాన్ జట్టు.. ఈ మ్యాచులోనూ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు, బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లో.. ఓ దాంట్లో గెలుపొంది మరో దాంట్లో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టును బెంగళూరు అడ్డుకుంటుందేమో చూడాలి.
IPL2022 CSK Vs PBKS : చెన్నైకి ఏమైంది? హ్యాట్రిక్ ఓటమి.. పంజాబ్ ఘన విజయం
జట్ల వివరాలు..
రాజస్తాన్ : జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
బెంగళూరు : డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్.
A solid 7⃣0⃣* from @josbuttler & some handy contributions from @SHetmyer (4⃣2⃣*) & @devdpd07 (3⃣7⃣) guide Rajasthan Royals to 169/3. ? ?#RCB chase underway ? ?
Scorecard ▶️ https://t.co/mANeRaI91i #TATAIPL | #RRvRCB pic.twitter.com/AEZ9k0cFQq
— IndianPremierLeague (@IPL) April 5, 2022