Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ ఈమేనా? వైరల్ గా మారిన యువ క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్ హైలైట్..
వైభవ్ ఇటీవల ఐపీఎల్ సీజన్ నుండి ఒక ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పంచుకున్నాడు.

Vaibhav Suryavanshi: యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో ఈ కుర్రాడి పేరు మార్మోగిపోయింది. ఫ్యాన్స్ కొన్ని రోజులు వైభవ్ నామజపం చేశారు. తాజాగా మరోసారి వైభవ్ సూర్యవంశీ పేరు తెరపైకి వచ్చింది. మరోసారి అతడి గురించి నెట్టింట డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈసారి క్రికెట్ కారణంగా కాదు.. ఓ అమ్మాయితో డేటింగ్ విషయంలో అతడి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ హైలైట్ వైరల్ కావడంతో వైభవ్ డేటింగ్ లో ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరపున తన మూడో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ బాదడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు వైభవ్. అదీ కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఇంత చిన్న వయసులోనే అతని అద్భుతమైన ప్రదర్శన అతడిని రాత్రికి రాత్రే పాపులర్ చేసింది. కానీ ఇప్పుడు క్రికెట్ నైపుణ్యాలకు భిన్నమైన కారణంతో మరోసారి చర్చకు దారితీశాడు వైభవ్.
వైభవ్ ఇటీవల ఐపీఎల్ సీజన్ నుండి ఒక ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పంచుకున్నాడు. ఆ ఫోటోలో అతను రాజస్థాన్ రాయల్స్ పింక్ టీ-షర్టు ధరించి, వీపు మీద బ్యాగ్‌తో నడుస్తున్నట్లు చూడొచ్చు. దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించాడు. అదొక ఇంగ్లీష్ లవ్ సాంగ్. అల్బేనియన్ రాపర్-గాయకుడు నోయిజీ పాడాడు. ఈ పోస్ట్.. వైభవ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని సూచిస్తోందని అభిమానులు అంటున్నారు.
Also Read: అరెరె.. ఐపీఎల్ అయిపోయినాక తుఫాన్ ఇన్నింగ్స్.. ఓ రెండు నెలల ముందు ఇలా ఆడుంటే..
ఇక ఆ పోస్ట్‌లో వైభవ్ ఒక అమ్మాయిని ట్యాగ్ చేయడం మరింత హైలైట్ అయ్యింది. అతను ట్యాగ్ చేసిన యూజర్ పేరు “@aditeeeeeeeeee_”. ఆ ఖాతా ప్రైవేట్ అయినప్పటికీ, ప్రొఫైల్ పిక్చర్‌లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. అంతే.. ఆ అమ్మాయి వైభవ్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండవచ్చని అభిమానుల్లో భారీ ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ”ఈ వయసులో నీకు గర్ల్ ఫ్రెండ్ అవసరమా? క్రికెట్ మీద మరింత ఫోకస్ పెట్టు. రొమాన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉంది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ”బ్రో నీ వయసు ఇంకా 14 ఏళ్లే. అప్పుడే ఇలాంటి పోస్టులు పెట్టడం మొదలెట్టేశావా?” అని మరొక నెటిజన్ అడిగాడు. ”లవ్ కోసం తొందరపడొద్దు. ముందు ఆటపై దృష్టి పెట్టు” అని ఇంకో నెటిజన్ సూచించాడు. ఇలా పర్సనల్ లైఫ్ తో మరోసారి వైభవ్ పేరు సెన్సేషనల్ గా మారింది.
ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో ఉన్న అండర్ 19 బృందంలో వైభవ్ ఉన్నాడు. మరో యువ క్రికెటర్ ఆయుష్ మాన్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
View this post on Instagram