Ishan Kishan problem where does he fit in SRH Playing XI
గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఆఖరి మెట్టు పై బోల్తాపడింది. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలవాలని అటు సన్‌రైజర్స్ జట్టు, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు.
మెగావేలానికి ముందు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. ఇక వేలంలో ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లను దక్కించుకుంది.
ఇషాన్‌ను ఎక్కడ ఆడిస్తారు..?
అయితే.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. అతడిని ఎక్కడ ఆడించాలనే విషయం పై ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.
గత సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా చక్కగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 22 సగటుతో 320 పరుగులు చేశాడు. ముంబై తరుపున 84 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ ఎక్కువగా ఓపెనర్‌గానే వచ్చాడు. 49 సందర్భాల్లో ఓపెనర్‌గా వచ్చిన అతడు 33 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్థశతకాలు ఉన్నాయి.
ఇక మూడో స్థానంలో 11 సందర్భాల్లో వచ్చాడు. అయితే.. ఈ స్థానంలో అతడు పెద్దగా రాణించలేదు. 19 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో స్థానంలో 22 సగటుతో 583 పరుగులు చేశాడు. ఐదు, ఆరో స్థానాల్లో ఒక్కొ సారి బ్యాటింగ్ చేసిన ఇషాన్ అక్కడ పెద్దగా రాణించలేదు.
ఓపెనింగ్ జోడిని మార్చే సాహసం చేస్తారా?
ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల జోడీ గత సీజన్‌లో ఎలాంటి విన్యాసాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. దీంతో ఈ సీజన్‌లో ఈ జోడీని మార్చే అవకాశాలు దాదాపుగా లేవు.
అయితే.. బ్యాటింగ్‌లో ఆర్డర్ ఇషాన్ ను ఎక్కడ ఆడిస్తారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇషాన్ ఓపెనర్‌గానే రాణించాడు. ఒకవేళ అతడిని ఓపెనర్‌గానే పంపాలని భావిస్తే హెడ్‌కు జోడిగా పంపిచొచ్చు. అప్పడు అభిషేక్ శర్మ వన్‌డౌన్‌లో ఆడాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓపెనింగ్ జోడిని మార్చొద్దని భావిస్తే.. అప్పుడు ఇషాన్‌ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ స్థానంలో ఇషాన్ ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. అలా కాకుండా అతడిని మిగిలిన ఏ స్థానంలో ఆడించినా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మరీ ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలా వాడుకుంటుందో ఐపీఎల్ ప్రారంభమైతేనే తెలుస్తుంది.
మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..
పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, బ్రైడాన్ కార్సే, కమిండు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ.