Rishabh Pant: పంత్ స్థానం కావాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు – ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2022 మెగా వేలంలో కాస్ట్లీ ప్లేయర్ గా ఘనత దక్కించుకున్న ఇషాన్ కిషన్ తనకు రిషబ్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఇలా చెప్పాడు. తానెప్పుడూ రిషబ్ పంత్ నుంచి కాంపిటీషన్ గా..

Rishabh Pant: పంత్ స్థానం కావాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు – ఇషాన్ కిషన్

Rishab Ishan

Updated On : February 22, 2022 / 4:30 PM IST

Rishabh Pant: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కాస్ట్లీ ప్లేయర్ గా ఘనత దక్కించుకున్న ఇషాన్ కిషన్ తనకు రిషబ్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఇలా చెప్పాడు. తానెప్పుడూ రిషబ్ పంత్ నుంచి కాంపిటీషన్ గా ఫీల్ అవలేదని అంటున్నాడు. పంత్ తన సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. కిషన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది 3వన్డేలు, 8టీ20లు మాత్రమే.

2016 అండర్19 వరల్డ్ కప్ నుంచి వారిద్దరి మధ్యలో స్నేహం కొనసాగుతుంది. అంతేకాకుండా టీమిండియాలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్లుగా రాణిస్తున్నారు. వారిద్దరూ కలుసుకున్న ప్రతిసారి చాలా బాగా మాట్లాడుకుంటామని ఎప్పుడూ కాంపిటీటర్ లా ఫీల్ అవలేదని చెప్తున్నాడు ఇషాన్.

‘అవును రిషబ్ పంత్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం చాలా సార్లు కలిసి తిరుగుతాం. సమయం దొరికినప్పుడల్లా కలిసే సినిమా చూస్తాం. క్రికెట్ గురించి పరస్పరం చర్చించుకుంటాం. విభిన్నంగా ఆటను చూసే తీరును ఓపెన్ గా మాట్లాడుకుంటాం. అతని ప్లేస్ కావాలని నాకెప్పుడూ ఆలోచనకు కూడా రాలేదు. ఇంకొంత కాలమైనా మేం కాంపిటీషన్ గా ఫీల్ అవ్వం’ అని ఇషాన్ అంటున్నాడు.

Read Also: రిషబ్ పంత్ ఓపెన్ చేయడంపై రోహిత్ శర్మ బడా ప్లాన్

‘ఒక్కోసారి మంచి టాలెంటెడ్ ప్లేయర్ తో కాంపిటీషన్ ఉంటే అది చాలా సరదాగా ఉంటుంది. మంచి క్రికెట్ ఆడాలనుకుంటే రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు వికెట్ కీపింగ్ చేయడం నాకు ఇష్టం. ప్రయత్నిస్తా. చేయగలిగినంత చేసి చూపిస్తా’ అంటూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు.