Rohit Sharma: రిషబ్ పంత్ ఓపెన్ చేయడంపై రోహిత్ శర్మ బడా ప్లాన్
అహ్మదాబాద్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 2వ వన్డేలో పంత్ ఓపెనర్ గా దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. 50ఓవర్ల ఫార్మాట్ లో తొలిసారి పంత్ దిగేసరికి ప్రత్యర్థి జట్టుకు.

Rohit Sharma
Rohit Sharma: అహ్మదాబాద్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 2వ వన్డేలో పంత్ ఓపెనర్ గా దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. 50ఓవర్ల ఫార్మాట్ లో తొలిసారి పంత్ దిగేసరికి ప్రత్యర్థి జట్టుకు అంచనాలు తారుమారయ్యాయి. కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ పంత్ ను ముందుగా బ్యాటింగ్ కు పంపడం ఆలోచింపజేసింది. ఒడీన్ స్మిత్ డెలివరీకి ఆఫ్ స్టంప్ తో అటెంప్ట్ చేద్దామని ప్రయత్నించి 18పరుగులకే వెనుదిరిగాడు పంత్.
అయినప్పటికీ ఇండియా 44పరుగుల తేడాతో మూడు వన్డేల సిరీస్ లో టైటిల్ పక్కా చేసుకుంది. రిషబ్ పంత్ ను ఓపెనర్ గా దించడమనేది శాశ్వతమైన నిర్ణయం కాదని రోహిత్ శర్మ అంటూనే అలా చేయడానికి కారణాన్ని వెల్లడించాడు.
‘డిఫరెంట్ గా చేయడానికి ఇష్టపడతాను. ఇది విభిన్నంగా అనిపించింది.. అందుకే అలా చేశా. రిషబ్ పంత్ ఓపెనర్ గా రావడం చాలా మందికి నచ్చింది. కాకపోతే ఇది శాశ్వతమైన నిర్ణయం కాదు’ అని రోహిత్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా కాన్ఫిరెన్స్ లో అన్నాడు.
Read Also: ప్రతి ఒక్కరూ 3పాయింట్ల సీట్ బెల్ట్ ధరించాల్సిందే
తర్వాతి గేమ్ లో శిఖర్ ధావన్ వచ్చేస్తాడు. అతనికి కాస్త బ్రేక్ కావాలి. ఫలితాల కోసమే కాదు. మైండ్ లో దీర్ఘకాలిక ప్లాన్ తో కొన్ని పనులు చేస్తాం. ఫలితాలను పట్టించుకోం’ అని రోహిత్ అన్నాడు.