Shooter Nischal : రియో ప్రపంచకప్‌లో అద‌ర‌గొట్టిన నిశ్చల్.. షూటింగ్‌లో ర‌జ‌తం

రియోలోని ​​డి జెనీరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ (Nischal) అద‌ర‌గొట్టింది.

Shooter Nischal : రియో ప్రపంచకప్‌లో అద‌ర‌గొట్టిన నిశ్చల్.. షూటింగ్‌లో ర‌జ‌తం

shooter Nischal

Updated On : September 19, 2023 / 2:38 PM IST

shooter Nischal bags silver : రియోలోని ​​డి జెనీరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ (Nischal) అద‌ర‌గొట్టింది. ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించి ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌కు రెండో ప‌త‌కాన్ని అందించింది. ఫైన‌ల్‌లో నిశ్చ‌ల్ 458 స్కోరు సాధించింది. కాగా.. నార్వే షూట‌ర్ జీనెట్ హెగ్ డ్యూస్టాడ్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకుంది. ప్ర‌స్తుతం డ్యూస్టాడ్ ఎయిర్ రైఫిల్ యూరోపియన్ ఛాంపియన్ నిల‌వ‌డ‌మే కాకుండా 300 మీ 3P ప్రపంచ ఛాంపియన్. ఆమె ఖాతాలో ఐదు స్వర్ణాలతో సహా 12 ISSF ప్రపంచ కప్ పతకాలను కలిగి ఉంది.

నిశ్చ‌ల్ ఈ రోజు అత్యుత్త‌మ ఫామ్‌లో ఉంది. మహిళల 3Pలో క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. తాను ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డం ఇదే తొలిసారి అని, ప‌త‌కం సాధించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని నిశ్చ‌ల్ తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఈ ఉద‌యం రెండు ఎలిమినేష‌న్ రౌండ్లు జ‌రిగాయి. మొత్తం 73 మంది షూట‌ర్లు పాల్గొన‌గా 18 మంది ఎలిమినేట్ అయ్యారు. నిశ్చ‌ల్ 587 స్కోరుతో అర్హ‌త సాధించింది. ఇక క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో 592 స్కోర్ చేసింది. ప్రోన్ పొజిష‌న్‌లో 200 పాయింట్లు సాధించింది. ఈ క్ర‌మంలో గ‌తేడాది కైరోలో జ‌రిగిన ప్రెసిడెంట్స్ క‌ప్‌లో అంజుమ్ సాధించిన 591 స్కోరును నిశ్చ‌ల్ అధిగ‌మించింది. మ‌రోవైపు అంజుమ్ 586 స్కోరు సాధించింది. అయితే.. ఆమె 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ తేడాతో ఫైన‌ల్‌కు దూరమైంది. ఆయుషి 580 స్కోరుతో 35వ స్థానంలో నిలిచింది.

IND vs AUS : ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. అశ్విన్‌కు చోటు.. భారత‌ జట్టు ఇదే..

రియో ప్ర‌పంచ‌క‌ప్‌కు 16 మంది బృందం వెళ్ల‌గా మ‌హిళ‌ల 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇల‌వేనిల్ వ‌లారివ‌న్ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.