Yashasvi Jaiswal : విశాఖ‌లో విధ్వంసం.. య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచరీ.. అరుదైన జాబితాలో చోటు

విశాఖ‌ప‌ట్నంలో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్‌, విధ్వంస‌క‌ర ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు.

Yashasvi Jaiswal double century

Yashasvi Jaiswal double century : విశాఖ‌ప‌ట్నంలో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్‌, విధ్వంస‌క‌ర ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ డ‌బుల్ సెంచ‌రీని బాదాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో ద్విశ‌త‌కాన్ని అందుకున్నాడు. త‌న టెస్టు కెరీర్‌లో జైస్వాల్‌కు ఇదే మొద‌టి డ‌బుల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో అత‌డు ప‌లు ఘ‌న‌త‌ల‌ను అందుకున్నాడు. టీమ్ఇండియా త‌రుపున డ‌బుల్ సెంచ‌రీ బాదిన అతి పిన్న వయస్కుడైన భారతీయ బ్యాటర్‌లలో స్థానం సంపాదించాడు.

భారత్ తరఫున టెస్టుల్లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కులు

వినోద్ కాంబ్లీ కాంబ్లీ (21y 35d ) – 224 vs వెస్టిండీస్‌ 1993
వినోద్ కాంబ్లీ (21y 55d ) – 227 vs జింబాబ్వే 1993
సునీల్ గవాస్కర్ (21y 283d) – 220 vs వెస్టిండీస్ 1971
య‌శ‌స్వి జైస్వాల్ (22y 37d)- 209 vs ఇంగ్లాండ్ 2024

U-19 World Cup : నేపాల్ పై ఘ‌న విజ‌యం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌

టీమ్ ఇండియా త‌రుపున అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో మొద‌టి డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలోనూ య‌శ‌స్వి జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో అత‌డు ఆరో స్థానంలో నిలిచాడు. క‌రుణ్ నాయ‌ర్ ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.


త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు

కరుణ్ నాయర్ – 3 ఇన్నింగ్స్‌ల్లో
వినోద్‌ కాంబ్లీ – 4
సునీల్ గ‌వాస్క‌ర్ – 8
మ‌యాంక్ అగ‌ర్వాల్ -8
ఛ‌తేశ్వ‌ర్ పుజారా – 9
య‌శ‌స్వి జైస్వాల్ – 10

వీరిలో కరుణ్‌ నాయర్‌, వినోద్ కాంబ్లీ, ఛ‌తేశ్వ‌ర్ పుజారా, య‌శ‌స్వి జైస్వాల్ లు త‌మ మొద‌టి డ‌బుల్ సెంచ‌రీలు ఇంగ్లాండ్ పైనే అందుకోవ‌డం విశేషం.

Rishabh Pant : ఎన్నోసార్లు గ‌దిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న రిష‌బ్ పంత్‌

ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 290 బంతుల‌ను ఎదుర్కొన్నాడు. 19 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 209 ప‌రుగులు చేసి జేమ్స్‌ అండ‌ర్స్ బౌలింగ్‌లో బెయిర్ స్టో క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.