U-19 World Cup : నేపాల్ పై ఘ‌న విజ‌యం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌

అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువ భార‌త్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది.

U-19 World Cup : నేపాల్ పై ఘ‌న విజ‌యం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌

India thrash Nepal to secure semi-final berth

Updated On : February 3, 2024 / 9:26 AM IST

అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువ భార‌త్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస‌గా ఐదో మ్యాచులోనూ గెలిచింది. సూప‌ర్ సిక్స్‌లో భాగంగా నేపాల్‌తో జ‌రిగిన మ్యాచులో 132 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. కాగా.. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా సెమీస్‌కు చేర‌డం ఇది 11వ సారి కావ‌డం విశేషం.

మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 297 ప‌రుగులు చేసింది. సచిన్ దాస్(116; 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ దయ్ శరణ్(100; 107 బంతుల్లో 9 ఫోర్లు) సెంచ‌రీల‌తో స‌త్తా చాటారు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(9 నాటౌట్)కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవ‌కాశం రాలేదు. నేపాల్ బౌలర్లలో గుల్సాన్ జా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆకాష్ చాంద్ ఓ వికెట్ తీశాడు.

James Anderson : విశాఖ‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన జేమ్స్ అండ‌ర్స‌న్‌

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన నేపాల్‌ను భార‌త బౌల‌ర్లు వ‌ణికించారు. సౌమీ పాండే నాలుగు వికెట్ల‌తో నేపాల్ వెన్నువిరిచాడు. అర్షిన్ కుల‌క‌ర్ణి రెండు, రాజ్ లింబాని, ఆరాధ్య శుక్లా, మురుగణ్ అభిషేక్ లు త‌లా ఓ వికెట్ తీయ‌డంతో నేపాల్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ గెలుపుతో భార‌త్ గ్రూపు-ఏ లో టేబుల్ టాప‌ర్‌గా నిలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీస్‌లో టీమ్ఇండియా గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

T20 World Cup 2024 : ఆన్‌లైన్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 టికెట్లు.. ధ‌ర ఎంత‌, ఎలా బుక్ చేసుకోవాలంటే..?