James Anderson : విశాఖలో అరుదైన ఘనత సాధించిన జేమ్స్ అండర్సన్
ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ అరుదైన ఘనతను అందుకున్నాడు.

James Anderson
ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఆడడం ద్వారా చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక వయసులో మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 41 ఏళ్ల 187 రోజులు. గతంలో ఈ రికార్డు భారత ఆటగాడు లాలా అమర్‌నాథ్ పేరిట ఉండేది.
1952లో 41 ఏళ్ల 92 రోజుల వయసులో లాలా అమర్‌నాథ్ భారత గడ్డ పై పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఈ జాబితాలో రే లిండ్‌వాల్ (38 ఏళ్ల 112 రోజులు), షూటే బెనర్జీ (37 ఏళ్ల 124 రోజులు), గులామ్ గార్డ్(34 ఏళ్ల 20 రోజులు) లు ఉన్నారు.
History created by Anderson. ?
– He is the oldest pacer to play Tests in India. pic.twitter.com/VcxhpfmUBO
— Johns. (@CricCrazyJohns) February 2, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179) భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు. మిగిలిన వారిలో శుభ్‌మన్ గిల్ (34), రజత్ పాటిదార్ (32), శ్రేయస్ అయ్యర్ (27), అక్షర్ పటేల్ (27) లు ఫర్వాలేదనిపించగా రోహిత్ శర్మ (14) విపలం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్లీ లు తలా ఓ వికెట్ తీశారు.
అండర్సన్ మరో రికార్డు..
సీనియర్ ఆటగాడు అండర్సన్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అత్యధిక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు శివనరైన్ చంద్రపాల్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరు 22 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్టులు ఆడారు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 25 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్టులు ఆడాడు.
Rishabh Pant : ఎన్నోసార్లు గదిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆసక్తికర విషయాలను పంచుకున్న రిషబ్ పంత్