Jan Nicol Loftie Eaton : టీ20 క్రికెట్‌లో పెను విధ్వంసం.. చ‌రిత్ర సృష్టించిన న‌మీబియా ఆట‌గాడు

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది.

Jan Nicol Loftie Eaton

Jan Nicol Loftie Eaton : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. కేవ‌లం 33 బంతుల్లోనే సెంచ‌రీ చేసి న‌మీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. నేపాల్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ క్ర‌మంలో అత‌డు 2023లో ఆసియా క్రీడల సందర్భంగా మంగోలియాపై 34 బంతుల్లో శ‌త‌కం సాధించిన నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా రికార్డును బ్రేక్ చేశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో నేపాల్ త‌రుపున మ‌ల్లా ఆడుతున్నాడు. అత‌డు ఫీల్డింగ్ చేస్తుండ‌గా జాన్ నికోల్ అత‌డి రికార్డును బ్రేక్ చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా.. ఈ ఇన్నింగ్స్ ముందు వ‌ర‌కు జాన్ నికోల్ లాప్టీ గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు. 15.72 స‌గ‌టు మాత్ర‌మే కలిగి ఉన్నాడు. అత‌డి పేరిట ఓ సెంచ‌రీ గానీ, అర్ధ‌సెంచ‌రీ కానీ లేదు. అయితే.. నేపాల్‌తో మ్యాచ్‌లో అత‌డు అనూహ్యంగా చెల‌రేగాడు. లాఫ్టీ-ఈటన్ సాధించిన శ‌త‌కం నమీబియా క్రికెట్‌కు ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. ఇది అసోసియేట్ దేశాలలో పెరుగుతున్న పోటీతత్వాన్ని, ప్రతిభను సూచిస్తోంది. ఈ ఇన్నింగ్స్ నిస్సందేహంగా రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ వేదికపై అసాధారణమైన విన్యాసాలు చేయగల ఆటగాడిగా లాఫ్టీ-ఈటన్‌ని గుర్తు చేస్తుంది.

Mohammed Shami : ఆస్పత్రిలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ .. ఏమైందో తెలుసా?

కాగా.. జాన్ నికోల్ విధ్వంస‌క‌ర శ‌త‌కంతో న‌మీబియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగులు చేసింది.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

1.జాన్ నికోల్ లాఫ్టీ-ఈట‌న్ (న‌మీబియా) – 33 బంతుల్లో
2.కుశాల్ మల్లా (నేపాల్‌) – 34
3.డేవిడ్ మిల్ల‌ర్ (ద‌క్షిణాఫ్రికా) – 35
4.రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 35
5.సుదేష్ విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్ ) – 35

ట్రెండింగ్ వార్తలు