Mohammed Shami : ఆస్పత్రిలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ .. ఏమైందో తెలుసా?
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరువాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లండ్ తో

Mohammed Shami
Indian Star Bowler Shami : టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. షమీ గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ 2023లో చీలమండ గాయానికి గురై కొంతకాలంగా క్రికెట్ కు ఈ స్టార్ పేసర్ దూరమయ్యాడు. తాజాగా షమీ ఆస్పత్రిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను స్వయంగా షమీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఆస్పత్రి బెడ్ పై ఉన్న మహ్మద్ షమీ విజయ చిహ్నాన్ని చూపుతున్నారు.
Also Read : Virat Kohli : ఇంగ్లాండ్ పై సిరీస్ విజయం.. కోహ్లి పోస్ట్ వైరల్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి షమీకి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. గాయం తగ్గడంకోసం ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకున్న తరువాత అతను ఫిట్ అవుతాడని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. షమీకి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా షమీ మడమ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆస్పత్రిలో ఉన్న ఫొటోలను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురు చూస్తంటాను’ అంటూ షమీ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : IND vs ENG 4th Test : సిరీస్ మనదే.. రాంచీ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరువాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లండ్ తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కూడా షమీ దూరమయ్యాడు. షమీ కోలుకోవడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కి కూడా షమీ దూరమయ్యాడు. 2022, 2023 ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో షమీ కీలక భూమిక పోషించారు.
https://twitter.com/MdShami11/status/1762172564028182849