Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డులు.. అరంగ్రేట మైదానంలోనే అందుకుంటాడా..?

రెండో టెస్టు మ్యాచుకు ముందు భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను అరుదైన రికార్డులు ఊరిస్తోంది.

Jasprit Bumrah

Team India pacer Jasprit Bumrah : సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఈ క్ర‌మంలో కేప్‌టౌన్ వేదిక‌గా జ‌న‌వ‌రి మూడు నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచులో భార‌త్ విజ‌యం సాధించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఇప్ప‌టికే కేప్‌టౌన్‌కు చేరుకున్న భార‌త ఆట‌గాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా.. రెండో టెస్టు మ్యాచుకు ముందు భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను అరుదైన రికార్డులు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గ‌నుక బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి ఏడు వికెట్లు తీస్తే కేన్‌టౌన్ గ్రౌండ్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన విదేశీ బౌల‌ర్‌గా (యాక్టివ్‌గా ఉన్న క్రికెట‌ర్ల‌లో) చ‌రిత్ర కెక్కుతాడు. కాగా.. ఈ రికార్డు ఇంగ్లాండ్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ పేరిట ఉంది. అత‌డు ఇక్క‌డ 16 వికెట్లు తీశాడు. బుమ్రా ఇక్క‌డ రెండు మ్యాచులు ఆడి 10 వికెట్లు సాధించాడు. మొత్తంగా చూసుకుంటే ఈ మైదానంలో ఇంగ్లాండ్ బౌల‌ర్ కొలిన్ బ్లైత్ 25 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Shahid Afridi : అల్లుడి ఇజ్జ‌త్ తీసిన మామ‌..! షాహీన్ అఫ్రిది టీ20 కెప్టెన్ ఎలా అయ్యాడో చెప్పిన షాహిద్ అఫ్రిది

క‌నీసం మూడు వికెట్లు ప‌డ‌గొట్టినా..

ఈ మ్యాచ్‌లో బుమ్రా క‌నీసం మూడు వికెట్లు తీసినా కూడా ఓ రికార్డు అత‌డి ఖాతాలో వ‌చ్చి చేరుకుంది. కేన్‌టౌన్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ఈ మైదానంలో మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ 12 వికెట్లు, అనిల్‌ కుంబ్లే 11 వికెట్లు తీశారు. ప్ర‌స్తుతం 10 వికెట్ల‌తో ఉన్న బుమ్రా గ‌నుక మ‌రో మూడు వికెట్లు తీస్తే శ్రీనాథ్ పేరిట 27 ఏళ్లుగా ఉన్న రికార్డు బ‌ద్ద‌లు కానుంది. మ‌రీ ఈ రెండు రికార్డుల‌ను బుమ్రా సాధిస్తాడా..? క‌నీసం ఒక్క రికార్డునైనా అందుకుంటాడా..? అన్నది చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. 2018లో కేప్‌టౌన్ వేదిక‌గానే బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేయ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 31 టెస్టులు ఆడిన బుమ్రా 132 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Poor Fielding : మీ దుంప తెగ‌.. ఒక్క బాల్‌కే ఐదు ప‌రుగులు ఇచ్చారు గ‌దా.. మీకంటే గ‌ల్లీ ఫీల్డ‌ర్లు న‌యం..!

 

ట్రెండింగ్ వార్తలు