రికార్డులు బద్దలు కొట్టిన బుమ్రా.. దీన్ని అధిగమించడానికి ఇక ఎన్ని దశాబ్దాలు పడుతుందో..

అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా..

Bumra

విశాఖపట్నంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును బద్దలు కొట్టాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా ఆరు వికెట్ల‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేస్‌మన్‌గా నిలిచాడు.

మొత్తం 6,781 బంతులు వేసి, 150 వికెట్లు తీశాడు బుమ్రా. అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా ఉమేశ్ యాదవ్ (7661), మహ్మద్‌ షమీ (7755), కపిల్ దేవ్ (8378), రవిచంద్రన్‌ అశ్విన్ (8380) ఉన్నారు. మ్యాచుల పరంగా చూస్తే.. బుమ్రా 34 టెస్ట్ మ్యాచ్‌లలో 150 వికెట్లు పూర్తి చేశాడు.

అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు (మ్యాచుల పరంగా)

  • రవిచంద్రన్ అశ్విన్ – 29 మ్యాచ్‌లు
  • రవీంద్ర జడేజా – 32 మ్యాచ్‌లు
  • ఎరపల్లి ప్రసన్న – 34 మ్యాచ్‌లు
  • అనిల్ కుంబ్లే – 34 మ్యాచ్‌లు
  • జస్ప్రీత్ బుమ్రా – 34 మ్యాచ్‌లు
  • హర్భజన్ సింగ్ – 35 మ్యాచ్‌లు
  • బీఎస్ చంద్రశేఖర్ – 36 మ్యాచ్‌లు

Virat Kohli: రెండో బిడ్డకు జన్మనివ్వనున్న హీరోయిన్ అనుష్క శర్మ.. కోహ్లీ గురించి చెబుతూ కన్ఫర్మ్ చేసిన డివిలియర్స్