ICC Test rankings : జస్‌ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు..

ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా హ‌వా కొన‌సాగుతూనే ఉంది.

Jasprit Bumrah

ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా హ‌వా కొన‌సాగుతూనే ఉంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో వికెట్ల పంట పండిస్తున్న బుమ్రా మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. బౌల‌ర్ల ర్యాంకుల‌ రేటింగ్ పాయింట్ల‌లో అత్యుత్త పాయింట్లు సాధించిన భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో అత‌డు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను అధిగ‌మించాడు. గ‌తంలో అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించగా.. బుమ్రా ప్ర‌స్తుతం 907 రేటింగ్‌లో పాయింట్లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. అశ్విన్ 2016లో ఈ రేటింగ్ పాయింట్ల‌ను అందుకున్నాడు.

ఐసీసీ బౌల‌ర్ల‌లో ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. క‌మిన్స్, ర‌బాడ‌, మార్కో జాన్సెన్ ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

Gautam Gambhir : ఇక చాలు.. టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ల పై గౌత‌మ్ గంభీర్ గ‌రం గ‌రం..! ఎక్కువ చేస్తే..

ఐసీసీ బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌..
జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 907 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 843 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 837 రేటింగ్ పాయింట్లు
క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 832 రేటింగ్ పాయింట్లు
మార్కో జాన్సెన్ (ద‌క్షిణాఫ్రికా) – 803 రేటింగ్ పాయింట్లు

ఇక బ్యాటింగ్ విభాగానికి వ‌స్తే.. మెల్‌బోర్న్ టెస్టులో రాణించిన య‌శ‌స్వి జైస్వాల్‌, నితీశ్ రెడ్డి లు త‌మ ర్యాంకుల‌ను మెరుగు ప‌ర‌చుకున్నారు. య‌శ‌స్వి ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక నితీశ్ రెడ్డి ఏకంగా 20 స్థానాలు ఎగ‌బాకి 528 రేటింగ్ పాయింట్ల‌తో 53వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జోరూట్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు.

Virat Kohli – Rohit Sharma : చేతిలో చేయి వేసుకుని న్యూ ఇయ‌ర్ పార్టీకి వెళ్లిన కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.. రోహిత్ శ‌ర్మ పోస్ట్ వైర‌ల్‌..

ఐసీసీ బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..
జోరూట్ (ఇంగ్లాండ్) – 895 రేటింగ్ పాయింట్లు
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్‌) – 876 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) – 867 రేటింగ్ పాయింట్లు
య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్‌) – 854 రేటింగ్ పాయింట్లు
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 780 రేటింగ్ పాయింట్లు