Virat Kohli – Rohit Sharma : చేతిలో చేయి వేసుకుని న్యూ ఇయర్ పార్టీకి వెళ్లిన కోహ్లీ, అనుష్క శర్మ.. రోహిత్ శర్మ పోస్ట్ వైరల్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు.

Virat Kohli and Anushka Sharma Holding Hands Spotted In Sydney
కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారంతా కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. సోషల్ మీడియా వేదికగా టీమ్ఇండియా ఆటగాళ్లు సైతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టు సిడ్నీలో ఉంది. అక్కడే ఆటగాళ్లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సరే.. మంగళవారం టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. వారు న్యూ ఇయర్ పార్టీకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rohit Sharma : రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ వైరల్..
రోహిత్ శర్మ పోస్ట్ ..
కొత్త సంవత్సరం సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. ఎత్తు పల్లాలను చవిచూశాం. థ్యాంక్యూ 2024 అంటూ రోహిత్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో టీ20 ప్రపంచకప్ విజయం, రెండో సారి తండ్రి కావడం, పుట్టిన రోజు వేడుకలు, షూటింగ్స్ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ వెనుకబడింది. మెల్‌బోర్న్ టెస్టులో ఓడిపోయింది. ఫలితంగా నాలుగు మ్యాచులు ముగిసే సరికి భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది.
Vinod Kambli : ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ డ్యాన్స్.. చక్ దే ఇండియా పాటకు.. ఆనందంలో ఫ్యాన్స్..
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. వీరిద్దరు జట్టుకు భారం అయ్యారని, రిటైర్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు మొదలుఅయ్యాయి. సిడ్నీ టెస్టు మ్యాచే సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ కు ఆఖరిది అని ప్రచారం జరుగుతోంది.
Virat Kohli And @AnushkaSharma Spotted On The Streets Of Sydney For A New Year Party! 🥂🎆🖤#Virushka #HappyNewYear #AUSvIND @imVkohli pic.twitter.com/oAHD8Fxk1A
— virat_kohli_18_club (@KohliSensation) December 31, 2024
View this post on Instagram