Rohit Sharma : రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ వైరల్..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Irfan Pathan comments on Rohit Sharma viral
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. హిట్‌మ్యాన్ కెప్టెన్ కాకపోయి ఉంటే ఈ పాటికే అతడిని తుది జట్టు నుంచి తప్పించేవారని అన్నాడు. బ్యాటర్‌గా రోహిత్ దారుణంగా విఫలం అవుతుండడంతో టీమ్‌కాంబినేషన్ సరిగ్గా కుదరడం లేదన్నాడు.
గత కొన్నాళ్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమీతో ఇబ్బందులు పడుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం ఒకే ఒక సారి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10.93 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ సత్తా చాటలేకపోతున్నాడు. తన బ్యాటింగ్‌తో జట్టుకు కీలకంగా మారుతాడు అనుకుంటే విఫలం అవుతూ భారంగా మారుతున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు. రెండో టెస్టుకు అతడు తిరిగి రాగా భారత్ ఓడిపోయింది. మూడో టెస్టు మ్యాచ్ లో వర్షం కారణంగా ఓటమి నుంచి తప్పుకుని డ్రాతో గట్టెక్కింది. భారత్. అయితే.. నాలుగో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. దీంతో 5 మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ క్రమంలో జట్టుకు భారంగా మారిన రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే మంచిదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సిరీస్ ముగిసిన తరువాత హిట్‌మ్యాన్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ షూటు వ్యాఖ్యలు చేశాడు.
Vinod Kambli : ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ డ్యాన్స్.. చక్ దే ఇండియా పాటకు.. ఆనందంలో ఫ్యాన్స్..
అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 20వేల పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఇప్పుడు రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడని తెలిపాడు. అతడు కెప్టెన్ కాబట్టి జట్టులో ఉంటుదన్నాడని అన్నాడు. ఒకవేళ అతడు కెప్టెన్ కాకపోయి ఉంటే తుది జట్టులో అతడికి చోటు దక్కదన్నాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్ వచ్చే వారన్నాడు. అప్పుడు జట్టు కాంబినేషన్ సెట్ అవుతుందన్నారు.