Joe Root finding the best ways to shine the ball
PAK vs ENG : ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ బంతిని షైన్ చేసేందుకు చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. స్పిన్నర్ జాక్ లీచ్ బట్టతలపై రూట్ బంతిని రుద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బంతి షైన్ కోసం జో రూట్ ఉత్తమ మార్గంను కనుగొన్నాడు అంటూ రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కమ్రాన్ గుహ్లామ్ (118; 224 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) శతకంతో చెలరేగాడు. సయిమ్ అయుబ్ (77; 160 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు తీశాడు. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సె, మాథ్యూ పాట్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్?
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆదిలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫికీ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3) లు విఫలం అయ్యారు. దీంతో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చాడు అరంగ్రేట ప్లేయర్ కమ్రాన్ గుహ్లామ్. మరో ఓపెనర్ సయిమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సయిమ్ ఔట్ అయినా తరువాత మహ్మద్ రిజ్వాన్ (37 బ్యాటింగ్)తో ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కమ్రాన్. 104 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన కాసేపటి తరువాత ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అఘా సల్మాన్‌తో కలిసి రిజ్వాన్ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు.
Virat Kohli : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డు పై విరాట్ కోహ్లీ కన్ను..
Joe Root finding the best ways to shine the ball 🤣 pic.twitter.com/nUnI58voVI
— Sky Sports Cricket (@SkyCricket) October 15, 2024