Jos Buttler : టీ20 క్రికెట్‌లో బాబ‌ర్ ఆజాంను అధిగ‌మించిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఇక మిగిలింది డేవిడ్ వార్న‌ర్‌, విరాట్ కోహ్లీలే..

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ (Jos Buttler) టీ20ల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక..

Jos Buttler surpasses Babar Azam in T20 cricket milestone club

Jos Buttler : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ (Jos Buttler) టీ20ల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ‌ట్ల‌ర్ వెల్ష్ ఫైర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు పాక్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం (Babar Azam) ను అధిగ‌మించాడు. టీ20 క్రికెట్‌లో బాబ‌ర్ 309 ఇన్నింగ్స్‌ల్లో 93 హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా బ‌ట్ల‌ర్ 436 ఇన్నింగ్స్‌ల్లో 94 అర్థ‌శ‌త‌కాలు బాదాడు. ఇక ఈ జాబితాలో 113 హాఫ్ సెంచ‌రీల‌తో డేవిడ్ వార్న‌ర్ (David Warner) అగ్ర‌స్థానంలో ఉండ‌గా, విరాట్ కోహ్లీ (Virat Kohli) 105 హాఫ్ సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

CPL 2025 : నేటి నుంచే క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఫ్రీగా మొబైల్‌లో ఎలా చూడొచ్చొ తెలుసా?

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* డేవిడ్ వార్న‌ర్ – 418 ఇన్నింగ్స్‌ల్లో 113
* విరాట్ కోహ్లీ – 397 ఇన్నింగ్స్‌ల్లో 105
* జోస్ బ‌ట్ల‌ర్ – 436 ఇన్నింగ్స్‌ల్లో 94
* బాబ‌ర్ ఆజామ్ – 309 ఇన్నింగ్స్‌ల్లో 93
* క్రిస్ గేల్ – 455 ఇన్నింగ్స్‌ల్లో 88

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ జ‌ట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగులు చేసింది. వెల్ష్ ఫైర్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ (26), కోహ్లర్-కాడ్మోర్ (26), టామ్ అబెల్ (22) లు రాణించారు. మాంచెస్టర్ ఒరిజినల్స్ బౌల‌ర్ల‌లో జోష్ టంగ్‌, స్కాట్ క్యూరీ లు చెరో మూడు వికెట్లు తీశారు. సోనీ బేకర్, టామ్ హార్ట్లీ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Ravichandran Ashwin : అప్పుడు నేను చెప్పిన మాట‌ను ఎవ‌రూ విన‌లేదు.. కానీ.. అశ్విన్‌

అనంత‌రం 138 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్ జ‌ట్టు 97 బంతుల్లో 112 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో వెల్ష్ ఫైర్ 25 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మాంచెస్ట‌ర్ ఆట‌గాళ్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (34 బంతుల్లో 57) హాఫ్ సెంచ‌రీతో రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. వెల్ష్ ఫైర్ బౌల‌ర్ల‌లో రిలే మెరెడిత్ నాలుగు వికెట్లు తీశాడు. డేవిడ్ పేన్, క్రిస్ గ్రీన్ లు చెరో మూడు వికెట్లు తీశారు.