K Thimmappiah Memorial Tournament Arjun Tendulkar Faces Off With Samit Dravid
Arjun Tendulkar vs Samit Dravid : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు తమ తమ నైపుణ్యాలతో ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్ కు విజయాలను అందించారు. ఇక వీరి కుమారులు కూడా తండ్రి బాటలో పయనించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాడు.
SL vs PAK : భారత్ చేతిలో ఓటమి.. శ్రీలంకతో పాక్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. ఓడితే ఇంటికే..
తాజాగా వీరిద్దరు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో జరుగుతున్న కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో తలపడ్డారు. అర్జున్ గోవా తరుపున, సమిత్ KSCA సెక్రటరీస్ XIకు ప్రాతినిధ్యం వహించాడు. గోవా, KSCA సెక్రటరీస్ XIకు మధ్య జరిగిన మ్యాచ్‌లో (Arjun Tendulkar vs Samit Dravid) అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో సమిత్ ద్రవిడ్ ఔట్ అయ్యాడు.
సమిత్ 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 9 పరుగులు చేశాడు. క్రీజులో సెట్ అయ్యాడు అనుకుంటున్న తరుణంలో అర్జున్ బౌలింగ్‌లో కషబ్ బక్లే క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ టోర్నమెంట్‌లో కర్ణాటక టాప్ ఆటగాళ్లు కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా ఆడుతున్నారు.
త్వరలోనే ఓ ఇంటివాడు కానున్న అర్జున్..
త్వరలోనే అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కానున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌ను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవలే అర్జున్, సానియాల నిశ్చితార్థం జరిగింది. సానియా.. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే.