Kane Williamson: కేన్ మామ దంచికొట్టాడు.. టెస్ట్ క్రికెట్‌లో 31వ సెంచరీ నమోదు.. టెండూల్కర్ తరువాత ఇతనే

టెస్ట్ కెరీర్ లో తక్కువ ఇన్నింగ్స్ లలో 30 సెంచరీలు దాటిన బ్యాటర్లలో కేమ్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు.

Kane Williamson

31st Century in Test Cricket: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ మిలియమ్సన్ తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో వరుస సెంచరీలతో పరుగుల వరద పారించాడు. ఫలితంగా ఒకే టెస్టు లో రెండు సెంచరీలు చేయడం ద్వారా 31వ సెంచరీని విలియమ్సన్ పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మౌంట్ మౌంగనుయ్ లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 511 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా (240) డబుల్ సెంచరీ చేయగా.. కేన్ మిలియమ్సన్ (118) పరుగులు చేశాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (109) మరో సెంచరీ చేశాడు. ఫలితంగా టెస్ట్ క్రికెట్ లో కేన్ విలియమ్సన్ సెంచరీలు 31కు చేరాయి.

Also Read : మూడో టెస్టుకు ముందే ఇంగ్లండ్ జట్టు భార‌త్‌ను ఎందుకు వదిలి వెళ్తుంది..? అసలు కారణం ఇదే..

టెస్ట్ కెరీర్ లో తక్కువ ఇన్నింగ్స్ లలో 30 సెంచరీలు దాటిన బ్యాటర్లలో కేమ్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు. సచిన్ 165 ఇన్నింగ్స్ లో 31 సెంచరీలు చేయగా.. స్టీవ్ స్మిత్ 170 ఇన్నింగ్స్ లో 31 సెంచరీలు నమోదు చేశాడు. కేన్ మిలియమ్సన్ సైతం 170 ఇన్నింగ్స్ లో 31 సెంచరీలు నమోదు చేసి సచిన్ తరువాత స్థానంలో నిలిచాడు. మరోవైపు కేన్ విలియమ్సన్ గతకొద్దికాలంగా అద్భుత ఫామ్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. గత 10 ఇన్నింగ్స్ లలో ఆరు టెస్టు సెంచరీలు సాధించాడు.

Also Read : ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సాధించిన సెంచరీ కేన్ విలియమ్సన్ టెస్టు కెరీర్ లో 31వ సెంచరీ. ఫాబ్ -4 జాబితాలో అత్యధిక సెంచరీలు సాధించిన విలియమ్సన్ ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ 30 సెంచరీలు, భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ 29 సెంచరీలు సాధించారు. కాగా, ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ పేరిట 32 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఒకే టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన ఐదో కివీస్ బ్యాటర్ గా విలియమ్సన్ రికార్డు సాధించాడు. గతంలో గ్లెన్ టర్నర్, జియోఫ్ హోవార్త్, ఆండ్రూ జోన్స్, ఫిటర్ ఫుల్టన్ ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేశారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు